Tipu Sultan's Sword: టిప్పు సుల్తాన్ కత్తి వేలం.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..?
Tipu Sultan's Sword: లండన్‌లో నిర్వహించిన వేలంలో 18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
అత్యధిక ధర పలికి అందర్ని అవాక్కయ్యేలా చేసింది. లండన్‌లో ఈ వారం జరిగిన ఇస్లామిక్ , ఇండియన్ ఆర్ట్ సేల్‌లో మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఈ ఖడ్గం ఏకంగా కోటీ 40 లక్షల 80 వేల 900 పౌండ్లకు వేలం వేయబడింది. భారతీయ రూపాయల ప్రకారం దీని ఖరీదు దాదాపు 143 కోట్లుకు పై మాటే..
1782 నుండి 1799 వరకు పాలించిన టిప్పు సుల్తాన్ కత్తిని 'సుఖేల' అని పిలుస్తారు, ఇది శక్తికి చిహ్నం. 18 వ శతాబ్దం నాటి ఈ ఖడ్గాన్ని లండన్‌లోని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ వేలం వేసింది. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని చెల్లించకుండా పారిపోయిన బిజినెస్‌మెన్ విజయ్ మాల్యా.. గతంలో ఒకసారి ఈ ఖడ్గాన్ని కొనుగోలు చేసి.. మళ్లీ విక్రయించినట్లు తెలుస్తోంది.
టిప్పు సుల్తాన్ యొక్క కత్తి ఉక్కుతో తయారు చేయబడింది. బంగారంతో అందంగా చెక్కబడింది. మే 1799లో ఈస్టిండియా కంపెనీ జనరల్ డేవిడ్ బైర్డ్, 'టైగర్ ఆఫ్ మైసూర్'గా పిలువబడే టిప్పు సుల్తాన్ కు మధ్య దాడి జరిగింది. ఈ యుద్దంలో టిప్పు సుల్తాన్ వీరోచితంగా పోరాడి.. ప్రాణాలు కోల్పోతారు. ఈ దాడి అనంతరం టిప్పు సుల్తాన్ ధైర్యం, పరాక్రమణకు గుర్తుగా ఉన్న ఈ కత్తిని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుంటారు.
టిప్పు సుల్తాన్‌కు చెందిన అన్ని ఆయుధాలలో ఈ అద్భుతమైన కత్తి అత్యుత్తమమైనదని బోన్‌హామ్స్‌లోని ఇండియన్ ఆర్ట్ అండ్ ఇస్లామిక్ గ్రూప్ హెడ్ నిమా సాగర్చి ఓ ప్రకటనలో తెలిపారు. టిప్పు సుల్తాన్ కత్తికి అసాధారణమైన చరిత్ర, అసమానమైన నైపుణ్యం ఉందని అన్నారు.దాని అద్భుతమైన హస్తకళ దాని ప్రత్యేకత మరింత పెంచిందని అన్నారు. టిప్పు సుల్తాన్ కు సంబంధించిన అన్ని ఆయుధాలలోకెల్లా ఈ ఖడ్గం చాలా గొప్పది.
ఈ కత్తిపై భగవంతుని ఐదు గుణాలు, ప్రత్యేకంగా రెండు ప్రార్థనలు హిల్ట్ మీద బంగారు అక్షరాలతో చెక్కబడి ఉన్నాయి. అంతే కాకుండా ఆ ఖడ్గంపై 'పాలకుడి కత్తి' అని రాసి ఉంటుందట. ఖడ్గం పిడి పులి తలగా రూపొందించబడింది. గ్రూప్ లీడర్ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు ఫోన్ ద్వారా వేలం వేయగా, ఓ వ్యక్తి స్వయంగా వచ్చి వేలం వేయడంతో వారి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 1799 మేలో శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ రాజ కోటను ధ్వంసం చేసిన తరువాత, అతని రాజభవనం నుండి అనేక ఆయుధాలు తొలగించబడ్డాయి. ఇందులో కొన్ని ఆయుధాలు ఆయనకు అత్యంత సన్నిహితులుగా భావించారు.
0 Comments:
Post a Comment