Suspend - హెచ్‌ఎం, టీచర్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు సస్పెన్షన్
● రికార్డుల తారుమారు, అక్రమ పోస్టింగ్ వ్యవహారంలో చర్యలు ● ఒకే సంఘటనలో మొత్తం ఆరుగురిపై వేటు
గుంటూరు ఎడ్యుకేషన్: డిప్యూటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయురాలికి రెగ్యులర్‌గా పోస్టింగ్ కల్పించేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో ఒక హెచ్‌ఎంతో పాటు ఉపా ధ్యాయురాలు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు పడింది.
గుంటూరు రూరల్ గోరంట్ల పరిధిలోని అన్నపూర్ణనగర్ ఎంపీపీ పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడు డి. మల్లిఖార్జునరావు, పిడుగురాళ్ల ఎంపీపీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న డి.నాగరాజకుమారితో పాటు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డీఈవో పి.శైలజ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. పిడుగురాళ్ల ఎంపీపీ స్కూల్లో ఎస్జీటీగా పని చేస్తున్న డి. నాగరాజకుమారిని గతంలో డిప్యూటేషన్‌పై గుంటూరు డీఈవో కార్యాలయంలో ఏపీవోగా పోస్టింగ్ ఇచ్చారు.
కాగా ప్రభుత్వం డిప్యూటేషన్లను రద్దు చేసిన తరువాత సదరు ఉపాధ్యాయినిని మాతృ పాఠశాలకు పంపకుండా, రికార్డులను తారుమారు చేసి, నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు రూరల్ గోరంట్ల, అన్నపూర్ణనగర్‌లోని ఎంపీపీ స్కూల్లో పోస్టింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన సంఘటనపై విచారణ జరిపించిన ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇటీవల గుంటూరు ఎంఈవో ఖుద్దూస్‌తో పాటు సూపరింటెండెంట్‌గా పనిచేసిన పి. నరసింహారావును సస్పెండ్ చేశారు. తాజాగా మరో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. మొత్తంమీద ఈ వ్యవహారంలో ఆరుగురు సస్పెండయ్యారు.
0 Comments:
Post a Comment