ఇరువురు విద్యాశాఖ ఉద్యోగుల సస్పెన్షన్.
గుంటూరు ఎంఈవో, పల్నాడు డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్లపై వేటు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గుంటూరు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్‌ను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్య ఆర్జేడీ వీఎస్ సుబ్బారావు శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు.
పిడుగురాళ్లలోని ఎంపీపీ స్కూల్లో ఎస్టీగా పనిచేస్తున్న డి. నాగరాజకుమారిని గతంలో గుంటూరు డీఈవో కార్యాలయంలో సహాయ ప్రోగ్రామింగ్ అధికారి (ఏపీవో)గా డిప్యూటేషన్‌పై నియమించారు. అయితే ప్రభుత్వం డిప్యూటేషన్లను రద్దు చేసిన తరువాత సదరు ఉపాధ్యాయినిని మాతృ పాఠశాలకు పంపాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు రూరల్ గోరంట్ల, అన్నపూర్ణనగర్‌లోని ఎంపీపీ స్కూల్లో పోస్టింగ్ ఇచ్చారు. సదరు ఉపాధ్యాయిని నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిందిగా ఆర్జేడీ సుబ్బారావుకు సూచించడంతో ఆయన డీఈవో పి.శైలజను విచారణాధికారిగా నియమించారు.
దీనిపై ఎంఈవో ఖుద్దూస్ నుంచి వివరణ తీసుకున్నారు. కాగా డీఈవో శైలజ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎంఈవో ఖుద్దూస్‌తో పాటు ఇదే సంఘటనకు సంబంధించి గతంలో ఉమ్మడి గుంటూరు డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి,ప్రస్తుతం పల్నాడు డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పి. నరసింహారావును సైతం బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు.
0 Comments:
Post a Comment