బెంగళూరు:siddaramaiah: సిద్ధరామయ్య... మ్యాన్ ఆఫ్ మాస్. అవును కర్నాటక సీఎం అభ్యర్థి సిద్ధరామయ్య సంథింగ్ స్పెషల్.
ఈయన్ను నాయకుడిగా పార్టీ తయారు చేయలేదు. ప్రజలలోనుంచి నాయకుడిగా అవతరించారు. గతేడాది ఆగష్టులో సిద్ధరామయ్య 75వ పుట్టినరోజు సందర్భంగా దావణగెరెలో నిర్వహించిన వేడుకలను సిద్ధమహోత్సవ్‌గా ఆయనే స్వయంగా ప్రకటించారు.
ఆ వేడుకలకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారంటే సిద్ధకు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏంటో అర్థం అవుతుంది.
ఇక తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధరామయ్య ఈ వేదికను ఒక చక్కటి అవకాశంగా మలుచుకున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే వేదిక వద్దకు చేరుకునేందుకు రాహుల్ గాంధీకి చాలా సమయం పట్టింది.
అంతలా ఆ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది.ఎన్నికలకు ముందు తన ప్రజాబలమేంటో పరోక్షంగా చూపించారు సిద్ధరామయ్య. తన బలమంతా ప్రజలే అని పార్టీకాదని అధినాయకత్వానికి అప్పుడే సంకేతాలు పంపారు సిద్ధరామయ్య.
మరి ఇంతటి ప్రజాబలం, ప్రజాదారణ ఉన్న నాయకుడెవరైనా సరే ప్రజలతో టచ్‌లో ఉండేందుకు ఇప్పుడున్న టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తారు. కానీ సిద్ధరామయ్య సంథింగ్ డిఫరెంట్.
ఇప్పటికీ సిద్ధరామయ్య ఫోన్ మెయిన్‌టెయిన్ చేయరంటే నమ్ముతారా... కానీ ఇది పచ్చి నిజం. నమ్మి తీరాల్సిందే. ఇప్పటికీ పార్టీలోని అగ్రనేతలంతా సిద్ధరామయ్యను కలవాలంటే అతని పీఏ ద్వారానే టచ్‌లోకి వస్తారు.
కర్నాటకలో కాంగ్రెస్ ఇంత భారీ మెజార్టీతో గెలుపొందిందంటే సిద్ధరామయ్య గ్రౌండ్ వర్క్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మహిళలకు,నిరుద్యోగులకు ఆర్థికభరోసా, పేదలకు 10కిలోల ఉచిత బియ్యం హామీలిచ్చి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించగలిగారు.
ఆ తర్వాత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి సిద్ధరామయ్య సక్సెస్ అయ్యారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఐదేళ్లు (2013-2018) పూర్తిగా కర్నాటక రాష్ట్రానికి సీఎంగా ఉన్న ఏకైక వ్యక్తి సిద్ధరామయ్య.
సిద్ధరామయ్యకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ అతన్ని మరోసారి సీఎం అభ్యర్థిగా చేసింది. అంతేకాదు బీజేపీ నేతలు సిద్ధరామయ్యను టార్గెట్ చేస్తూ ముస్లిం సామాజిక వర్గంకు మాత్రమే ఆయన పరిమితం అంటూ ప్రచారం చేశారు.
అందుకే ఆయన్ను సిద్ధరాముల్లాఖాన్ అంటూ పిలిచారు. దీనిపై సిద్ధరామయ్య చాలా తెలివిగా స్పందించారు. ముస్లిం సామాజిక వర్గంకు తాను చేసిన పనిని గుర్తిస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
తనను చాలా పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య. తనను అన్న రామయ్యగా, రైతు రామయ్యగా, కన్నడ రామయ్యగా, దళిత రామయ్యగా పిలుస్తారని ఆయన చెప్పారు.
బీజేపీ వారు తనను సిద్దరాముల్లాఖాన్న అని పిలుస్తున్నారంటే ముస్లిం సామాజిక వర్గం తనకు దగ్గరవుతున్నందుకే అని చెప్పుకొచ్చారు.
మతపరమైన ఘర్షణలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment