తెల్ల నువ్వులను(White Sesame Seeds) ఎక్కువగా ఆడపిల్లలు రజస్వల అయినపుడు బెల్లంతో కలిపి పెడతారు. ఇలా తినడం వల్ల చెడురక్తం బయటికి పోవడంతో పాటు శరీరం కూడా దృఢంగా ఉంటుంది.
రజస్వల అయింది మొదలు.. ప్రతి నెల నెలసరి పూర్తయ్యాక వారంరోజుల పాటు బెల్లంతో కలిపి నువ్వుండలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల శాస్త్రీయ నామం సేసామమ్ ఇండికమ్. ప్రతిరోజూ ఒక స్పూన్ నువ్వులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
1. పొట్టు తీసిన మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల్లో 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అదనంగా గుండె జబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్లు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి ప్రమాదాలను తగ్గించడంలో ఫైబర్ సహాయపడుతుంది.
2.క్రమం తప్పకుండా నువ్వులను తింటే గుండె జబ్బులకు కారణమయ్యే అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లను తగ్గిస్తాయి. నువ్వులు 15 శాతం సాచురేటెడ్ కొలెస్ట్రాల్, 41 శాతం పాలీ
అన్ సాచురేటెడ్ కొవ్వు, 39 శాతం మోనో శాచురేటెడ్ కొవ్వును కలిగి ఉంటాయి. ఈ మూడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.
3. మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల్లో 5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కండరాల నుండి హార్మోన్ల వరకూ ప్రతి దానిని నిర్మించడంలో ప్రొటీన్ సహాయపడుతుంది.
4.నువ్వుల ద్వారా లభించే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతూ.. గుండెపోటు రాకుండా కాపాడుతుంది. నువ్వుల్లో లిగ్నాన్స్, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్ లు రక్తప్రసరణకు సహాయపడుతాయి.
5. నువ్వు గింజల నుండి తీసిన పొట్టులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఆక్సలేట్ లు, ఫైటేట్ లు, సహజ కాంపౌండ్ లను కలిగి ఉంటాయి.
6. నువ్వులు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. నువ్వులను క్రమం తప్పకుండా తినడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు సైతం అదుపులో ఉంటాయి.
7. నువ్వుల్లో బి విటమిన్ అధికంగా లభిస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల్లో మెటబాలిజం, సెల్ ఫంక్షన్ కోసం అవసరమయ్యే బి విటమిన్స్ లభిస్తాయి.
8. నువ్వుల్లో ఉండే ఐరన్, విటమిన్ బి6 ఎర్ర రక్తకణాల నిర్మాణానికి పని చేస్తాయి.
9. వీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అలాగే ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా లభిస్తాయి. నువ్వుల్లో ఉండే పినోరెసినోల్ అనే ద్రవం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
10. నువ్వుల్లో గామా టోకోఫెరోల్ అని పిలువబడే విటమిన్ ఈ యాంటి ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి.
11. నువ్వులు రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన జింక్, సెలీనియం, రాగి, ఇనుము, విటమిన్ బి6, విటమిన్ ఈ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. జింక్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
12. కీళ్లనొప్పులకు ఆస్టియో ఆర్థరైటిస్ అత్యంత సాధారణ కారణం. నువ్వు గింజల్లో ఉండే సేసమిన్ అనే కాంపౌండ్ ఊబకాయాన్ని నివారిస్తుంది. కీళ్లనొప్పులు అధికంగా ఉన్నవారు రెండునెలలపాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు 5 టేబుల్ స్పూన్ల నువ్వులు తినడంతో కీళ్లనొప్పులు తగ్గినట్లు ఓ అధ్యయనం పేర్కొంది.
13.థైరాయిడ్ తో బాధపడేవారికి నువ్వులు చక్కని ఔషధం. వీటిలో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అవసరమైన ఇనుము, రాగి, విటమిన్ బి6ను సరఫరా చేస్తాయి.
14.నువ్వుల్లో ఫీతోస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్లను కలిగి ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ను తగ్గించడంలో ఇవి ఉపయోగపడుతాయి.
నువ్వులను కాస్త గోధుమ రంగు వచ్చేంత వరకూ వేయించి పొడి చేసి, దానిని కూరల్లో వేసుకుని లేదా వేడి వేడి అన్నంలో వేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది.
లేదా రోటి పచ్చళ్లలో కూడా నువ్వులను రెగ్యులర్ గా వాడుకోవచ్చు. అలాగే నువ్వు చిక్కిలు రెగ్యులర్ గా తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మహిళలు నువ్వులతో కూడిన వంటలను తినాలి.
0 Comments:
Post a Comment