SBI New Rules: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... కొత్త రూల్స్ అమలులోకి
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది. అనేక కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.
ఈ నెలలో కూడా పలు మార్పులు వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ అయిన ఎస్‌బీఐ కార్డ్ మే 1 నుంచి కొన్ని నిబంధనల్ని అమలు చేసింది. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ కార్డ్ (SBI Card) తమ కస్టమర్లకు అధికారిక వెబ్‌సైట్, ఇమెయిల్స్ ద్వారా వెల్లడిస్తోంది. మరి మీరు ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్ అయితే, మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) ఉన్నా, ఈ నియమనిబంధనల్ని గుర్తుంచుకోండి.
AURUM క్రెడిట్ కార్డ్ ద్వారా EazyDiner ప్రైమ్, లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలను కస్టమర్‌లు ఇక పొందలేరు. AURUM క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.5,00,000 మైల్‌స్టోన్ ఖర్చుపై RBL లక్స్ నుంచి రూ.5,000 కూపన్‌ను పొందలేరు. వారు టాటా CLiQ లగ్జరీ నుంచి ఈ కూపన్‌ను పొందుతారు. ఎస్‌బీఐ ఆన్‌లైన్ అద్దె చెల్లింపులు చేస్తున్నప్పుడు సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డ్ , సింప్లీక్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డ్‌ల వాడకంపై రివార్డ్ పాయింట్లను కూడా తగ్గించింది. రివార్డ్ పాయింట్లు 5 రెట్ల నుంచి 1ఎక్స్‌కి తగ్గించబడ్డాయి.
క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్స్‌తో ఆభరణాలు, పాఠశాల, విద్యా సేవలు, యుటిలిటీస్, బీమా సేవల కార్డ్‌ల వంటి సేవలపై ఎలాంటి క్యాష్‌బ్యాక్‌ను అందించవు. గిఫ్ట్స్, నావల్టీస్, సావనీర్ షాప్స్, మెంబర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, క్వాసీ క్యాష్, రైల్వేస్ లాంటివాటిపైనా క్యాష్‌బ్యాక్ లభించదు. ఇక గత నెలలో కూడా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించి పలు మార్పులు చేసింది ఎస్‌బీఐ కార్డ్.
సింప్లీ క్లిక్ ఎస్‌బీఐ కార్డ్, సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్‌బీఐ కార్డ్‌లో సవరణలు వచ్చాయి. రివార్డ్ పాయింట్లను 10 రెట్ల నుంచి ఐదు రెట్లకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. కార్డ్ హోల్డర్స్ అపోలో 24/7, బుక్ మై షో నుంచి కొనుగోలు చేయడం ద్వారా 10 రెట్లు రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు. Cleartrip, EazyDiner, Netmedsకి సంబంధించిన చెల్లింపుల కోసం కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా కార్డ్ హోల్డర్‌లు 10ఎక్స్ రివార్డ్ పాయింట్లను కూడా అందుకుంటారు.
మార్చి 17 నుంచి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను కూడా మార్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా వివరాలను వెల్లడించింది ఎస్‌బీఐ కార్డ్. అద్దె చెల్లించడానికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడితే రూ.199 + పన్నులు చెల్లించాలి. ఇంతకుముందు రూ.99 + పన్నులు ఉండేవి.
0 Comments:
Post a Comment