SBI Net Banking: బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవలు యాక్టివేట్ చేసుకోండిలా!
SBI News | మీకు ఎస్‌బీఐ కస్టమరా? నెట్ బ్యాంకింగ్ సేవలు పొందాలని భావిస్తున్నారా? అయితే మీరు బ్యాంక్ (Bank) బ్రాంచ్‌కు వెళ్లకుండానే నెట్ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు.
ఎలా? అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ముందుగా మీరు ఎస్‌బీఐ (SBI) నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆన్‌లైన్ ఎస్‌బీఐ అని ఉంటుంది. ఇప్పుడు పర్సనల్ బ్యాంకింగ్ సెక్షన్‌లోకి వెళ్లాలి. కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు టర్మ్ అండ్ కండీషన్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత న్యూ యూజర్ రిజిస్ట్రేషన్/ యాక్టివేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ పేజ్‌పై క్లిక్ చేయాలి.
రిజిస్టరేషన్ పేజ్‌లో మీరు అకౌంట్ నెంబర్, సీఐఎఫ్ నెంబర్, బ్రాంచ్ కోడ్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చేసుకోండి. లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కష్టం అవుతుంది. తర్వాత ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి.
ఇప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఏటీఎం కార్డు ఉందా? లేదా? అనేవి ఇవి. మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఏటీఎం కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. ఏటీఎం కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. లేదంటే లేదు. ఏటీఎం కార్డు లేకపోతే మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వస్తుంది. సబ్‌మిట్ చేయాలి. టెంపరరీ యూజర్ నేమ్ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
లాగిన్ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ పేజ్‌లోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అదనపు వివరాలు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ కొషన్స్ వంటివి ఎంటర్ చేయాలి. ఇలా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత సులభంగానే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. మీ వద్ద ఏటీఎం కార్డు లేకపోతే మాత్రం.. మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఏటీఎం కార్డు కోసం, అలాగే నెట్ బ్యాంకింగ్ సేవల కోసం అక్కడే అప్లై చేసుకోవచ్చు. సింపుల్‌గా మీరు ఈ సేవలు పొందొచ్చు. ఏటీఎం కార్డు ఉంటే మాత్రం ఇంట్లో నుంచే మీరు నెట్ బ్యాంకింగ్ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment