Right To Walk : నడక హక్కును అమలు చేసిన తొలి రాష్ట్రం.. అక్కడ ఫుట్‌పాత్‌లు తప్పనిసరి!
దేశంలో నడక హక్కు (రైట్ టు వాక్)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారులు, సైక్లిస్టుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐతో సహా అన్ని రహదారి యాజమాన్య ఏజెన్సీలు రోడ్ల నిర్మాణం, విస్తరణలో భాగంగా ఫుట్‌పాత్‌లు నిర్మించడాన్ని తప్పనిసరి చేసింది పంజాబ్ ప్రభుత్వం. తద్వారా 'నడక హక్కు'ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.
పంజాబ్ హర్యానా హై కోర్ట్, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్ పై ఆయా కోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది . పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువా ఆ రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ సలహాదారు నవదీప్ అసిజాకు ఇచ్చిన సమాచారం మేరకు.. రాష్ట్రంలో ఇకపై చేపట్టే అన్ని రోడ్ల నిర్మాణాలు, విస్తరణల్లో సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు తప్పనిసరి.
ఈ మేరకు ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను నిర్మించడానికి కావాల్సిన బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, స్థానిక సంస్థలు, ఎన్‌హెచ్‌ఏఐ, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగాలకు కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం నుంచి లేఖలు అందాయి.
0 Comments:
Post a Comment