Record Package: వరంగల్ నిట్ స్టూడెంట్ రికార్డు..రూ.88 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం..
Record Package: విద్యార్థులు ఒక తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని చింతించనక్కర్లేదు. ఆ సంగతి మరిచి కృషి, పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగితే సక్సెస్ సాధించడం ఎప్పటికైనా సాధ్యమవుతుంది.
ఈ విషయాన్ని తాజాగా ఒక స్టూడెంట్ నిరూపించాడు. పదో తరగతిలో కేవలం 75% మార్కులు మాత్రమే సాధించిన ఈ స్టూడెంట్ ఇటీవలి ప్లేస్‌మెంట్ సెషన్‌లో కళ్లు చెదిరే ప్యాకేజీ సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT-W)లో ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆదిత్య సింగ్ ఆ ఇన్‌స్టిట్యూట్ చరిత్రలో హయ్యెస్ట్ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది రికార్డును బద్దలు కొట్టాడు.
కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆదిత్య సింగ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో రూ.88 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ అందుకున్నాడు. ఈసారి IIT హైదరాబాద్‌లో M.Tech స్టూడెంట్స్ పొందిన ప్యాకేజీలలో హయ్యెస్ట్ ప్యాకేజీ రూ.63.8 లక్షలు కాగా ఆదిత్య సదరు ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్స్‌ను సైతం వెనక్కి నెట్టేశాడు. అంతేకాకుండా వరంగల్ క్యాంపస్ రికార్డును బద్దలు కొట్టాడు.
* మొదట నిరాశ, తర్వాత పట్టలేని ఆనందం
క్యాంపస్ ప్లేస్‌మెంట్ సమయంలో మొదట ఆదిత్యను కొన్ని కంపెనీలు రిజెక్ట్ చేశాయి. దాంతో నిరాశ పడిన ఈ స్టూడెంట్‌కి చివరికి ఒకే ఒక అవకాశం మిగిలింది. అదే అవకాశాన్ని ఆదిత్య సద్వినియోగం చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మూడు రౌండ్‌ల సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయగా.. ఆదిత్య వాటన్నింటిలో ఉత్తీర్ణత సాధించగలిగాడు. అలా ఆ కంపెనీకి వరంగల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంపిక అయిన ఏకైక అభ్యర్థిగా నిలిచాడు. ఆదిత్య తన ఇన్‌స్టిట్యూట్‌లో సాధారణంగా ఆఫర్ చేసే రూ.20-30 లక్షల ప్యాకేజీనే బెంగళూరు కంపెనీ కూడా అందిస్తుందని మొదట అనుకున్నాడు. కానీ ఆ కంపెనీ రూ.88 లక్షలు ఆఫర్ చేయడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
* ఆదిత్య అకడమిక్ రికార్డు
ఆదిత్య స్కూల్ సమయంలో పెద్దగా రాణించలేదు. ఈ విద్యార్థి 10వ తరగతిలో కేవలం 75 శాతం మార్కులు మాత్రమే సాధించాడు. అయితే, ఈ ఫలితం తర్వాత తన చదువుపై మరింత సీరియస్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 12వ తరగతిలో 96 శాతం స్కోరు చేశాడు. తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ బ్రేక్ తీసుకొని జేఈఈ మెయిన్స్‌కి బాగా ప్రిపేర్ అయ్యి NIT-Wలో అడ్మిషన్ సాధించాడు.
ఆదిత్య తండ్రి ఒక న్యాయవాది. సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చిన ఆదిత్య క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం లభించడం తన అదృష్టం అని చెబుతున్నాడు. కష్టపడి పనిచేయడంతో పాటు, ప్లేస్‌మెంట్ రౌండ్‌లో పాల్గొనాలనే అతని నిర్ణయం ఈ అదృష్టాన్ని తెచ్చి పెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆదిత్య సొంతంగా కోడింగ్ స్టడీ చేశాడు. IIIT అలహాబాద్‌లో చదువుతున్న తన సోదరుడి నుంచి సహాయం కోరాడు. అతను అసైన్‌మెంట్లు లేదా ఇతర బాధ్యతల భారం లేకుండా కోడింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. లాక్‌డౌన్ కాలాన్ని కూడా బాగా ఉపయోగించుకున్నాడు.
0 Comments:
Post a Comment