ఓ జాతీయ పార్టీ కీలకనేత అయినప్పటికి ..ఎలాంటి సెక్యురిటీ లేకుండానే జనం మధ్యలోకి రావడం, వారితో మాట్లాడటం వంటివి చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, వాయినాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ ఎలాంటి సెక్యురిటీ లేకుండా లారీలో ప్రయాణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సోమవారం రాత్రి లారీ క్యాబిన్‌లో కూర్చొని ఢిల్లీ నుంచి చండీఘడ్ వరకు ప్రయాణించారు.
ఢిల్లీలో లారీ క్యాబిన్‌లో కూర్చునే ముందు అందరికి అభివాదం చేసి..చేతులు ఊపి అదే లారీలో అంబల వరకు ప్రయాణించారు. అక్కడ గురుద్వారాలో పూజలు చేసుకున్నారు. అటుపై అంబాలా నుంచి సిమ్లాకు బయలుదేరారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ సిమ్లా చేరుకున్నారు.
కాంగ్రెస్ కీలక నేత లారీలో ప్రయాణించడం వెనుక ఆయన గూడ్స్ లారీ డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రయాణాల్లో వారు ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకే ఈవిధంగా వినూత్నంగా లారీలో ప్రయాణించడం జరిగింది.
దేశ వ్యాప్తంగా మొత్తం తొమ్మిది మిలియన్ల ట్రక్కు డ్రైవర్లు ఉన్నారు. వారికి వృత్తితో పాటు వ్యక్తిగత సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు రాహుల్‌గాంధీ. అంబాల నుంచి చండిగడ్ వరకు లారీలో ప్రయాణించారు.
రాహుల్‌గాంధీ అంత పెద్ద నాయకుడు సాదాసీదాగా ఎలాంటి సెక్యురిటీ లేకుండా ట్రక్కులో ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని రాహుల్‌గాంధీ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.
అయితే రాహుల్‌గాంధీ సెక్యురిటీ లేకుండా లారీలో ప్రయాణించడంపై ప్రశంసలతో పాటు విమర్శలు వస్తున్నాయి. అంత పెద్ద నాయకుడు సెక్యురిటీ లేకుండా ఎలా ప్రయాణిస్తారని ప్రశ్నిస్తున్నారు.
రాహుల్‌గాంధీ కర్నాటక పొలిటికల్ హీట్‌తో అలసిపోయారని ..అందుకే రిలాక్స్ అవ్వడానికే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా చేరుకున్నారని తెలుస్తోంది. ఇక్కడ అతను తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఇంట్లో ఉంటున్నాడు. ప్రియాంక గాంధీ సిమ్లాలోని ఛరాబ్రాలో ఇల్లు కట్టుకుంది.
0 Comments:
Post a Comment