బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని ఆ దేశ ట్రెజరీ గురువారం ప్రకటించింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655 కోట్లు.
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చులను గురువారం ట్రెజరీ చీఫ్ సెక్రటరీ జాన్ గ్లెన్ పార్లమెంటుకు సమర్పించారు.
Queen Elizabeth | లండన్, మే 18: బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని ఆ దేశ ట్రెజరీ గురువారం ప్రకటించింది.
మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655 కోట్లు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చులను గురువారం ట్రెజరీ చీఫ్ సెక్రటరీ జాన్ గ్లెన్ పార్లమెంటుకు సమర్పించారు.
70 ఏండ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో ఉన్న ఎలిజబెత్ గత ఏడాది సెప్టెంబరు 8న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు సెప్టెంబరు 19న అధికారికంగా జరిగాయి.
వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో పాటు లక్షలాది మంది ఆమెకు నివాళులర్పించారు. 10 రోజుల పాటు బ్రిటన్‌లో సంతాప దినాలను పాటించారు.
1965లో బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అంత్యక్రియల తర్వాత అధికారిక హోదాలో బ్రిటన్‌లో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగాయి.
0 Comments:
Post a Comment