M umbai slum girl : ముంబయి మురికివాడలో నివసించే 14 ఏళ్ల అమ్మాయి..సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అయిపోయింది. మోడల్‌గానే కాదు రెండు హాలీవుడ్ సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఇదంతా ఎలా సాధ్యమైంది?
మలీషా ఖర్వా ముంబయి ధారవి మురికివాడలో నివసించే బాలిక. మొట్ట మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె ప్రపంచానికి పరిచయం అయ్యింది.
సోషల్ మీడియాలో షేర్ చేయబడిన 'లైవ్ యువర్ ఫెయిరీ టేల్' అనే షార్ట్ ఫిల్మ్‌లో మొదటిసారి కనిపించింది.
ఇందులో రెస్టారెంట్‌లో భోజనం చేసే ఐదుగురు మురికివాడల పిల్లల అనుభవాన్ని చిత్రించారు. ఆ తరువాత 'ఫారెస్ట్ ఎసెన్షియల్' అనే సంస్థ ప్రాడక్ట్స్‌కు మోడల్ గా ఎంపికైంది.
forestessentials ఇన్ స్టాగ్రామ్‌లో మలీషా నటించిన యాడ్ ఒకటి షేర్ చేసింది. 2020 లోనే హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మన్ దృష్టిలో పడింది మలీషా. ఆమె కోసం అతను 'గో ఫండ్ మీ' పేజీని కూడా ఏర్పాటు చేశారు.
అప్పటి నుండి, ఆమె అనేక మోడలింగ్ గిగ్స్‌లో పాల్గొన్న మలీషా చాలా యాక్టివ్ గా ముందుకు సాగింది. మలీషా ఖర్వాను 'ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్' అని కూడా పిలుస్తారు.
తన జీవితంలో వచ్చిన కొత్త అవకాశాలను చూసి మలీషా సంబరపడిపోతోంది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని సోషల్ మీడియా కారణంగానే తనను ప్రజలు గుర్తించారని అందుకు చాలా గర్వంగా ఉందని చెబుతోంది.
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జీవితంలో ఆశని కోల్పోకూడదని చెబుతోంది మలీషా.
0 Comments:
Post a Comment