Prince Harry And Meghan: మీడియా ఫోర్త్ ఎస్టేట్ అని భావిస్తుంది కానీ.. చిన్న చిన్న విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. దానివల్ల ఎటువంటి కారణం లేకుండానే కొంతమంది బాధిత వర్గంగా మిగిలిపోతారు.
ఆ బాధిత వర్గంలో సామాన్యులు మాత్రమే కాదు రాజ కుటుంబాలు కూడా ఉంటాయి. అలాంటి మీడియా అత్యుత్సాహం వల్ల బ్రిటన్ రాజ కుటుంబం చాలా అవస్థలు పడింది..”పాపరజ్జి” ఒక గండం లాగా వేటాడడంతో నరకం చూసింది. అంతేకాదు బ్రిటన్ యువరాణి డయానా ను కూడా కోల్పోయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే
మంగళవారం అమెరికాలోని న్యూయార్క్ లో “విమెన్ ఆఫ్ విజన్” అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజ వంశానికి చెందిన హ్యారీ, భార్య మేఘన్, ఆమె తల్లి డోరియా తో కలిసి హాజరయ్యాడు.
అయితే ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వారిని వెంబడించారు. వారి ఫోటోల కోసం జర్నలిస్టులు(పాపరజ్జీ) వెంటపడ్డారు.
అయితే వారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు హ్యారీ, మేఘన్ చాలా ఇబ్బంది పడ్డారు.. అయితే దీనిపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ ” హ్యారీ, మేఘన్ ప్రయాణాన్ని ఫోటో జర్నలిస్టులు చాలా కఠినంగా మార్చారు.. వారి వల్ల పాదచారులు చాలా ఇబ్బంది.
అయితే ఎటువంటి ఘర్షణలు, సమన్లు, గాయాలు లేదా అరెస్టులు చోటు చేసుకోలేదు” అని వివరించారు.. అయితే దీనిపై హ్యారీ కూడా స్పందించాడు..” సెలబ్రిటీలు అంటే ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది.
వారి గురించి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఎవరి భద్రతను పణంగా పెట్టకూడదు.
మీడియా ప్రతినిధులు చేసిన అతి వల్ల నేను నా తల్లిని కోల్పోయాను..మా ఫోటోలు తీసుకునేందుకు ఫోటో జర్నలిస్టులు మా వెంట పడ్డారు. ఇది సరైన విధానం కాదు” అంటూ హ్యారీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
అయితే మేఘన్ కోసం హ్యారీ తన రాజకుటుంబ హోదాను వదులుకున్నాడు. అయితే మేఘన్ చామన ఛాయ ను కలిగి ఉండడంతో బ్రిటన్ రాజ వంశం ఆమెకు మీద వర్ణ వివక్ష చూపించింది.. హ్యారి సోదరుడు విలియమ్స్ పలుమార్లు ఆమెను దూషించాడు.
ఇవన్నీ పడ లేకే హ్యారీ తన భార్యతో అమెరికాకు మకాం మార్చాడు. అంతేకాదు 2020లో రాజకుటుంబ హోదాను కూడా వదులుకున్నాడు.
అయితే ఈమధ్య తన తండ్రి పట్టాభిషేక మహోత్సవానికి అతడు ఒంటరిగానే హాజరయ్యాడు.. మేఘన్ ను మన కుటుంబం వేధింపులకు గురి చేస్తున్నందు వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని హ్యారీ అప్పట్లో చెప్పాడు.
తల్లిని కోల్పోయాడు
మీడియా అతి వల్ల హ్యారీ తన తల్లిని కోల్పోయాడు. 1997 ఆగస్టులో ప్యారిస్ లో ఒక వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి చార్లెస్ భార్య డయానా, ఆమెకు అత్యంత సన్నిహితురాలు డోడి ఫాయెద్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి ఫోటో జర్నలిస్టులు డయానాను ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు.
ఆమె వారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది.. అయితే కారు అతివేగంతో నడపడం వల్ల ప్రమాదానికి గురైంది.
ఆ ప్రమాదంలో డయానా మరణించింది.. తన తల్లి కన్నుమూసినప్పటి నుంచి మీడియా అంటే హ్యారీ కి కోపం ఏర్పడింది.. అందుకే మీడియాను దగ్గరకు రానివ్వడు.
చివరికి తాను రాజ కుటుంబాన్ని వదిలి వెళుతున్నప్పుడు కూడా మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సున్నితంగా సమాధానం దాటవేశాడు. తాజాగా అమెరికాలో అవార్డుల ఫంక్షన్ కి కూడా మీడియా ఇలాంటి వేధింపులకు గురి చేయడంతో చాలా ఇబ్బంది పడ్డాడు.
డిఫరెంట్ క్యారెక్టర్
హ్యారీ బ్రిటన్ రాజు కుటుంబంలో పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్.. తన తల్లి మరణించినప్పుడు తన తండ్రి దగ్గరకు తీసుకోలేదని తాను రాసిన స్పేర్ అనే పుస్తకంలో పంచుకున్నాడు.
కాదు తన భార్య ను తన సోదరుడు విలియమ్స్ ఇలా ఇబ్బంది పెట్టింది, తనను ఇలా కొట్టింది ఆధారాలతో సహా వివరించాడు. తాను పెళ్ళికాకముందు బ్రిటన్ లోని ఒక పబ్ వెనకాల ప్రాంతంలో ఒక పెద్ద మహిళతో జరిపిన శృంగారాన్ని కూడా ఎటువంటి బిడియం లేకుండా వివరించాడు.
అప్పట్లో ఈ పుస్తకం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. రాజ కుటుంబాలు కూడా సాధారణమైన కుటుంబాలేనని, అక్కడ కూడా గొడవలు జరుగుతాయని హ్యారీ రాసిన “స్పేర్” పుస్తకం ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది.
ఇక ఇలాంటి అనుభవం విమెన్ ఆఫ్ విజన్ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా ఎదురయింది. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
0 Comments:
Post a Comment