వర్కుబుక్ రాయించని టీచర్లకు సన్మానం చేయాలా?
♦️సెలవులని క్షమిస్తున్నా... లేకుంటే ఇళ్లకు వెళ్లిపోయేవారు
♦️మళ్లీ వస్తా.. మార్పు రాకుంటే కఠిన చర్యలు: ప్రవీణ్ ప్రకాశ్
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా), మే 20: 'విద్యార్థులతో వర్కుబుక్ రాయించని ఉపాధ్యాయులకు సన్మానం చేయాలా!?, వేసవి సెలవులని క్షమించి వదిలేస్తున్నా. లేదంటే ఈపాటికి ఇళ్లకు వెళ్లిపోయేవారు' అంటూ ఇంటి వద్ద ఉన్న ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఫోన్లోనే హెచ్చ రించారు. శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, నాడు-నేడు పనులను తనిఖీచేశారు. తగిన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సచివాలయం ఇంజనీరింగ్ అసి స్టెంట్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం లంబసింగి వీధుల్లో పర్యటించారు. ఓ ఇంటికి వెళ్లిన ప్రవీణ్ ప్రకాశ్ నాలుగో తరగతి విద్యార్థిని హేమప్రియ వర్కబుక్ను పరిశీలించారు. గణితం, ఆంగ్లంలో ఒకటి, రెండు పేజీలు మాత్రమే పూర్తిచేయడంతో నారాయణరావుతో ఫోన్లో మాట్లాడారు. బోధన సమయంలో ఆ బాలిక పుస్తకం తీసుకురాలేదని ఉపాధ్యాయుడు సమాధానమిచ్చారు. పాఠశాలల పునః ప్రారంభం తరువాత మళ్లీ వస్తానని, ఉపాధ్యాయుల్లో మార్పు రాకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని ప్రవీణ్ ప్రకాశ్ హెచ్చరించారు.
0 Comments:
Post a Comment