టీచర్ల పదోన్నతి మార్గదర్శకాలు రద్దు
అంతా గందరగోళం...
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయ పదోన్నతు లకు సంబంధించి గత ఏడాది ఇచ్చిన మార్గదర్శకాలను పాఠ శాల విద్యాశాఖ రద్దు చేసింది. అయితే, ఎందుకు రద్దు చేస్తు న్నదీ చెప్పకపోవడం గమనార్హం. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతేడాది సర్దుబాటు పేరుతో ఇచ్చిన తాత్కాలిక పదోన్నతులు రద్దయ్యాయి. కానీ, సర్దుబాటు పేరుతో పాఠశాలలు మారిన టీచర్లు ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే కొనసాగుతారని అధికారులు తెలిపారు. ఈ ప్రభావం సుమారు 4 వేల మంది ఉపాధ్యాయులపై పడింది. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎస్జీటీ లకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతులకు కల్పించేందుకు మార్గదర్శకాలు జారీచేసింది. వాటిపై కొందరు టీచర్లు కోర్టును ఆశ్రయించ డంతో వాటిని 'సర్దుబాటు'గా మార్చింది. రెగ్యులర్ పదోన్న తుల్లా కాకుండా నెలకు రూ.2500 అదనపు పారితోషికంతో కొత్త పాఠశాలలకు వెళ్లాలని టీచర్లకు సూచించింది. పేరుకు సర్దుబాటు అయినా రెగ్యులర్ పదోన్నతుల తరహాలోనే ప్రక్రియ ప్రారంభించి, సీనియారిటీ ప్రాతిపదికన కొత్త పాఠ శాలలకు పంపింది. ఒకవేళ సర్దుబాటులో కొత్త పాఠశాలకు వెళ్లేందుకు ముందుకు రానివారు ఏడాది పాటు పదోన్నతు లకు అర్హత కోల్పోతారని హెచ్చరించింది. అసలు ఇవి పదో న్నతులే కానప్పుడు ఈ నిబంధనలు ఏంటని టీచర్లు ఆందో ళన చేసినా పాఠశాల విద్యాశాఖ అధికారులు వినిపించుకో లేదు. దీంతో అసలు అవి పదోన్నతులా? సర్దుబాటా? అనే స్పష్టత లేకుండానే సుమారు 4 వేల మంది కొత్త పాఠశా లల్లో చేరారు. అనంతరం వారికి అక్కడే రెగ్యులర్ ప్రమో షన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. కానీ.. ఇన్నాళ్లూ వారిని రూ.2,500 పారితోషికంతోనే పని చేయించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ మార్గదర్శకాలను రద్దు చేశారు. అయితే మార్గదర్శకాలు రద్దయినా ప్రస్తుతం ఎక్కడున్న టీచర్లు అక్కడే కొనసాగుతారని అధికారులు తెలిపారు. కాగా, కొంత కాలం అక్కడే కొనసాగినా మార్గదర్శకాలు మారడంతో తమ ప్రమోషన్లపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment