Oil Price: సామాన్యులకు మోదీ అదిరే శుభవార్త.. వంట నూనె ధరలు భారీగా తగ్గింపు!
Cooking Oil | సామాన్యులకు తీపికబురు.
పెళ్లిళ్ల సీజన్‌లో అదిరే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. వంట నూనె ధరలు మరింత దిగి రానున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్ల తగ్గుదలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లో కూడా వంట రూనె ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు సూచించింది.
దీని వల్ల వంట నూనె విక్రయించే కంపెనీలు ఆయిల్ ధరలను తగ్గించాని నిర్ణయం తీసుకున్నాయి. కుకింగ్ ఆయిల్ ధరను ఏకంగా 6 శాతం తగ్గించాలని డిసైడ్ అయ్యాయి. దీని వల్ల సామాన్యులకు చాలా ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కమొడిటీ రేట్లకు అనుగుణంగా దేశంలో వంట నూనె గరిష్ట విక్రయ ధర (ఎంఆర్‌పీ) కూడా తగ్గించాలని కేంద్రం తెలిపింది. అందువల్ల ఆయిల్ కంపెనీలు కూడా రేట్లు తగ్గింపునకు అంగీకారం తెలిపాయి.
ఫార్చూన్ బ్రాండ్ కింద వంట నూనె విక్రయించే అదానీ విల్‌మర్, జెమిని బ్రాండ్ కింద ఆయిల్ విక్రయిస్తున్న జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా వంటి కంపెనీలు వంట నూనె ధరలను వరుసగా లీటరుకు రూ. 5, రూ. 10 చొప్పున తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి.
రేట్ల తగ్గింపు ప్రయోజనం సామాన్యులకు వచ్చ మూడు వారాల్లో అందుబాటులోకి రానుంది. వంట నూనె ధరలు దిగి రావడం సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) మంగళవారం కీలక ప్రకటన చేసింది.
కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై ఎంఆర్‌పీ తగ్గించాలని తమకు తెలియజేసిందని ఎస్ఈఏ వెల్లడించింది. తమ సభ్యలకు ఈ విషయాన్ని తెలియజేయాలని, రేట్ల తగ్గింపు ప్రయోజనం సామాన్యులకు త్వరితగతిన అందేలా చూడాలని కోరిందని పేర్కొంది.
గత ఆరు నెలల కాలంలో చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు భారీగా దిగి వచ్చాయి. మరీముఖ్యగా గత 60 రోజుల కాలంలో రేట్లు ఇంకా తగ్గాయి. వేరు శనగ, సోయాబీన్, మస్టర్డ్ ఉత్పత్తి కూడా పెరిగింది. అయినా కూడా దేశీ మార్కెట్‌లో వంట నూనె ధరలు తగ్గలేదు.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చూస్తే.. దేశీ మార్కెట్‌లో వంట నూనె ధరలు ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయిల్ కంపెనీలు రేట్లు తగ్గించాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా కంపెనీలు కూడా రేట్లు తగ్గించాయి.
0 Comments:
Post a Comment