NEET 2023: మహిళా అభ్యర్థుల బ్రా స్ట్రాప్ తనిఖీ, దుస్తుల మార్పిడి.. మరి ఇంత దారుణమా?.. తనిఖీలపై విమర్శలు..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 7వ తేదీన నీట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పలు సందర్భాల్లో నీట్ ఫ్రిస్కింగ్ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి కూడా NEET-UG 2023 పరీక్షలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి రెండు ఘటనలు నివేదించబడ్డాయి. అక్కడ కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తనిఖీ చేసిన విధానంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, సోషల్ మీడియా యూజర్ల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనలకు సంబంధించి.. కొన్ని చోట్ల విద్యార్థులను వారి దస్తులను మార్చుకోవాల్సిందిగా చెప్పారు. దీంతో కొందరు సమీపంలోని షాప్‌లకు వెళ్లి కొత్త దుస్తులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాకుండా.. కొంతమంది విద్యార్థినులకు బ్రాలను తొలగించమని కోరారు. కొందరు విద్యార్థులు తమ బట్టల లోపల చేతులు పెట్టి బ్రా స్ట్రాప్‌లను తనిఖీ చేశారని కూడా చెప్పారు. అలాగే తనిఖీ కోసం లోదుస్తులను తెరవమని అడిగినట్టుగా ఆరోపించారు.
ఇందుకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. దీనిని పరిగణలోకి తీసుకుంటూ.. మహిళా అభ్యర్థులను పరీక్షించడంలో పాల్గొనే సున్నితత్వాలను గుర్తుంచుకోవడానికి పరీక్షా కేంద్రాల సిబ్బందికి సమగ్ర సూచనలను జారీ చేస్తామని ఎన్టీఏ తెలిపింది. నీట్ పరీక్ష క్లిష్టమైనదని.. అటువంటి పరీక్షకు హాజరవుతున్నప్పుడు విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున ఇటువంటి పద్ధతి ఆమోదయోగ్యం కాదని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు.
బెంగాల్‌లోని హింద్‌మోటార్‌లోని హెచ్‌ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్‌కు చెందిన ఒక అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో నివేదించాడు. ''పరీక్ష హాల్‌లోకి అనుమతించేందుకు పలువురు అభ్యర్థులను వారి ప్యాంటు మార్చుకోవాలని లేదా లోదుస్తులను తనిఖీ చేయాలని కోరినట్లు తెలిపాడు. చాలా మంది బాలికలు తమ జీన్స్‌ను వారి తల్లుల లెగ్గింగ్స్‌తో మార్చుకున్నారని అతుడ పేర్కొన్నాడు. పరీక్ష కేంద్రం చుట్టూ ఎటువంటి దుకాణాలు లేవని ఫలితంగా అమ్మాయిలు.. వారి దుస్తులను మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే ఓపెస్ ప్లేస్‌లోనే ఇది జరగడంతో.. అమ్మాయిలకు రక్షణగా వారి పెరేంట్స్ చుట్టూ నిల్చున్నారని తెలిపాడు. ఈ మేరకు టీవోఐ రిపోర్ట్ చేసింది. కొంతమంది విద్యార్థులు కేవలం ఇన్నర్‌వేర్‌తోనే పరీక్ష హాలులోకి వెళ్లారని కూడా ఆ విద్యార్థి ఆరోపించాడు.
బెంగాల్‌లోని హింద్‌మోటార్‌లోని హెచ్‌ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రిన్సిపల్ మాత్రం ఇలాంటి ఆరోపణలను తిరస్కరించారు. కొంతమంది విద్యార్థులు డ్రెస్ కోడ్‌ను పాటించలేదని.. అందుకే వారి దుస్తులను మార్చుకోవాలని కోరినట్టుగా చెప్పారు.
0 Comments:
Post a Comment