Neera: నోరూరించే నీరాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
తాటి, ఈత, ఖర్జూర చెట్ల నుండి తీసే నీరా ఎంతో రుచిగా ఉంటుంది. చూడటానికి అచ్చం కొబ్బరి నీటిలా కనిపించే నీరా.. కొంచెం తియ్యగా ఉండి అచ్చం కొబ్బరి నీరు తాగినట్లుగా అనిపిస్తుంది.
దీనిని పులియబెడితే కల్లుగా మారుతుంది. సూర్యోదయానికి ముందే నీరా సేకరిస్తారు. ఆ తర్వాత దీని రుచి మారుతూ వస్తుంది కాబట్టి ఎండ తగలకముందే సేకరిస్తారు.
కల్లులో మత్తును ఇచ్చే లక్షణాలు ఉంటాయి. కానీ నీరాలో అలాంటి లక్షణాలేవీ ఉండవు. నీరాలో ఆల్కహాల్ కంటెంట్ శాతం జీరో. నీరాను ఎవరైనా తాగవచ్చు. పెద్దలు పిల్లలు అనే తేడాలేం అవసరం లేదు. కొబ్బరి నీటిలా తాగేయవచ్చు. నీరాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నీరా ఎక్కువగా తాటి, ఈత చెట్లు ఉన్న దగ్గరే దొరుకుతుంది. సిటీలో ఉండే వారికి ఇది అందుబాటులో ఉండదు. అయితే వారికి కూడా నీరా రుచిని, దాని ఆరోగ్య ప్రయోజనాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నీరా కేఫ్ లను ప్రారంభించింది.
100గ్రా. నీరాలో ఉండే పోషకాలు:
కేలరీలు - 55 కిలో కేలరీలు
కార్బోహైడ్రేట్లు - 15 గ్రా
ఫ్యాట్ - 0 గ్రా
ప్రోటీన్ - 0.06 గ్రా
విటమిన్ సి - 20 ఎంజీ
తియామిన్ - 77 ఎంజీ
ఐరన్ - 0.05 ఎంజీ
మెగ్నీషియం - 2.9 ఎంజీ
పొటాషియం - 168.4 ఎంజీ
సోడియం - 90.6 ఎంజీ
జింక్ - 0.02 ఎంజీ
కాపర్ - 0.03 ఎంజీ
image-1
నీరా ఆరోగ్య ప్రయోజనాలు:
రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
విటమిన్లు, ఖనిజాలు నీరాలో పుష్కలంగా ఉంటాయి. నీరాలో ఉండే గ్లుటామిక్ యాసిడ్ అనే అమైనో ఆమ్లం సహా ఇతర పోషకాలు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. నీరాలోని పోషకాలు రెసిస్టెంట్స్ ఫ్రేమ్‌వర్క్‌ను పెంచుతాయి. ఇది అనారోగ్యాలపై పోరాడేలా చేస్తుంది.
మధుమేహం:
నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇతర పానీయాలతో పోలిస్తే నీరాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. చక్కెర లో 70, తేనెలో 55, చెరకు రసంలో 68 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే నీరాలో కేవలం 35GI ఉంటుంది. అందువల్ల నీరాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిరభ్యంతరంగా తాగొచ్చు.
రక్తపోటును తగ్గిస్తుంది:
నీరాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణకు ఇది చాలా కీలకం. పొటాషియం వాసోడైలేటర్ గా పనిచేస్తుంది. ఇది రక్త నాళాల నుండి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ధమనుల ద్వారా రక్తం సాఫీగా వెళ్లేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం హృదయనాళ వ్యవస్థ ఒత్తిడిని తగ్గించి, రక్తపోటును తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
నీరాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో నీరా సహాయపడుతుంది. నీరాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముడతలు, నల్ల మచ్చలు, వృద్ధాప్య సంకేతాల వంటి వివిధ చర్మ సమస్యలు దరిచేరవు.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
నీరాలో విటమిన్ సి పుష్కలంగా ఉంంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని చాలా మంచిది. అలాగే ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీరాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిశుక్లం, మచ్చల క్షీణత వంటి వివిధ రకాల కంటి సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ ను నివారిస్తుంది:
నీరాలో ఉండే విటమిన్ సి వంటి పైటోకెమికల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ సహా వివిధ రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడుతుంది.
0 Comments:
Post a Comment