ఈరోజు విద్యాశాఖా మంత్రి గారు,కమీషనర్ గారు,అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యాంశాలు
👉క్యాడర్ స్ట్రెంగ్త్ అప్ఢేషన్ పూర్తిగా చేయడం జరిగింది
👉303 మున్సిపల్ డి.డి.ఓ లకు శాలరీ పవర్స్ ఇవ్వడం జరిగింది.తిరుపతి జిల్లా గూడూరు, విశాఖలో కొంతమంది కి సిబ్బందికి సంబంధించి మ్యాపింగ్ సమస్యలను కూడా పరిష్కారిస్తామన్నారు
👉1752 మందికి హైస్కూల్ ప్లస్ లో ప్రమోషన్ అవకాశం కల్పిస్తామన్నారు
👉సమ్మర్ లో పాఠశాలకు హాజరుకాకుండా క్రియేటివ్ యాక్టివిటీస్ చేయమని టీచర్స్ ను కోరారు
👉యాప్ లను సరళతరం చేయడం జరిగింది.అటెండెన్స్ యాప్ లో MDMకు సంబంధించి ఎంతమంది తీసుకొన్నారో నంబరు మాత్రమే నమోదు చేయాలి.ఇదే సమాచారాన్ని గతంలో IMMS యాప్ లో నమోదు చేయవలసిన అవసరం లేదు
👉IMMS యాప్ లో 10% టాయిలెట్ ఫోటోలు తీస్తే సరిపోతుంది. పది టాయిలెట్ ఉంటే ఒక్కటి మాత్రమే క్యాప్చర్ చేయాలి
👉JVK కిట్ లో POOR క్వాలిటీ ఉంటే కంప్లైంట్ చేయవచ్చు
👉సమైక్యాంధ్ర ఇ.యల్ యాప్ లో అప్డేట్ చేయాలని అడుగగా పరిష్కారిస్తామని తెలియజేశారు
👉కరెంట్ బిల్లులు పెండింగ్ విషయం కూడా మంత్రిగారి దృష్టికి తీసుకొనిరాగా సమస్యలేకుండా చేస్తామని తెలియజేశారు
👉మున్సిపల్ సర్వీసు రూల్స్ పై 21అంశాలపై సంఘాల నుండి సూచనలు చేయడం జరిగిందని,అన్నీ అంశాలపై ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏవిధంగా జరుగుతున్నయో అదేవిధంగా చేస్తామని తెలియజేయడం జరిగింది
👉మున్సిపల్/ కార్పోరేషన్ విలీనం తరువాత ప్రమోషన్ లో ఎదురయ్యే రోస్టర్ సమస్యను ఏపిటిఎఫ్ ప్రస్తావించగా,ఆసమస్యను పరిగణలోనికి తీసుకొచ్చామని,లోతుగా అధ్యయనం చేసి ఎవరికీ నష్టం జరగకుండా చేస్తామని తెలియజేశారు
0 Comments:
Post a Comment