పె ళ్లి అయిన తర్వాత స్త్రీలు ఎప్పుడూ కూడా మంగళసూత్రం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదని చెబుతూ ఉంటారు.
అంతేకాకుండా మంగళసూత్రాన్ని ఎవరికీ కనిపించకుండా ధరించాలి అని చెబుతూ ఉంటారు.
మంగళం అంటే శుభప్రదం. సూత్రం అంటే తాడు. మంగళ సూత్రం అంటే శుభప్రదమైన తాడు అని అర్థం. అందుకే పెళ్లి అయినా ప్రతి ఒక వివాహితకు అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు. పెళ్లయిన వివాహేతకు మెడలో తాళిబొట్టు లేకపోతే మెడ అంతా కూడా బోసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఇప్పటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది.
వేదమంత్రాల సాక్షిగా బంధాన్ని ముడివేసే ఈ దారం భార్యభర్త అనుబంధానికి ప్రతీక. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో ముక్కోటి దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేయిస్తారు వేద పండితులు.
అసలు విషయంలోకి వెళితే.. మంగళసూత్రం ఎప్పుడూ కూడా స్త్రీ హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కిందవరకూ ఉండాలి.
పసుపు కుంకుమలు సౌభాగ్యానికి ప్రతీకలు మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. నిత్యం తాడుకి పసుపురాసుకోవడం, సూత్రాలకు కుంకుమ పెట్టుకోవడం చాలా మంచిది.
చాలామంది మంగళసూత్రంలో పగడాలు, ముత్యాలు, చిన్నచిన్న ప్రతిమలు పెట్టించుకుంటారు.
అవి ఫ్యాషన్ కోసం చేస్తారు కానీ అలా చేయకూడదంటారు పండితులు. అలాగే మంగళ సూత్రానికి ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండేలా చూడాలి.
ముఖ్యంగా చాలామంది స్త్రీలు మంగళ సూత్రాలకు పిన్నీసులు పెడతారు. కానీ వాస్తవానికి మంగళసూత్రాలకు ఎలాంటి ఇనుము వస్తువు తగలకూడదు.
ఇనుము నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో భర్త అనారోగ్యం పాలవుతారని, ఇద్దరి మధ్య అన్యోన్యత తగ్గుతుందని చెబుతారు.
0 Comments:
Post a Comment