Krishna Brindavanam Temple: వేసవి సెలవుల్లో చాలా మంది పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. ఇందుకోసం ఎక్కడికి వెళ్లాలో ముందే ప్లాన్ చేసుకుంటారు.
తమ బడ్జెట్ ఆధారంగా టూరిస్ట్ స్పాట్స్ సెలక్ట్ చేసుకుంటారు. వాటిలో కొన్ని ఆధ్యాత్మిక పర్యటనలు కూడా ఉంటాయి.
మీరు కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నడియాడిన బృందావ¯Œ ను ఎంపిక చేసుకోవచ్చు. అనేక ప్రసిద్ధ దేవాలయాలు అక్కడ ఉన్నాయి. ఈ వేసవిలో పర్యాటక సందర్శనం కోసం మీరు ఈ ఆలయాలను కూడా సందర్శించవచ్చు.
బృందావనం చరిత్ర
325 బీసీ నుంచి 184 బీసీ వరకు నగరాన్ని పాలించిన మౌర్య రాజవంశంలా బృందావనం కూడా పురాతనమైనది. క్రీస్తుపూర్వం 3000లో బృందావనం పట్టణీకరించబడిన వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. చాలా కాలానికి అది అంతరించిపోయిందని చాలా మందిచెబుతారు.
1515లో గొప్ప సన్యాసి చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణుని జన్మస్థలం కోసం వెళ్ళినప్పుడు బృందావనం తిరిగి కనుగొనబడింది.
చాలా మంది చరిత్రకారులు బృందావనం 1590లో నిర్మించబడిందని నమ్ముతారు. అయితే, గత 250 సంవత్సరాలుగా మాత్రమే ఈ ప్రాంతం మరింత చురుకుగా మరియు పట్టణీకరణ చెందింది.
అనేక ఆలయాలు…
బృందావన్ యమునా నది ఒడ్డున ఉన్న పురాతన నగరాలలో ఒకటి. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపాడని నమ్ముతున్నందున ఈ ప్రదేశానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.
శ్రీమహా విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడి పాడిన బృందావనంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆయన తన సోదరుడు బలరాముడితో, ఇంకా తన చిన్న నాటి సఖి రాధారాణితో కలిసి ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.
బంకే బిహారీ:
బంకే బిహారీ దేవాలయం బృందావనంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇక్కడికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు దర్శనం కోసం వస్తుంటారు. బృందావన్‌కు వెళితే ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.
కృష్ణ బలరామ్ ఆలయం
- ఈ కృష్ణ బలరామ్ ఆలయాన్ని ఇస్కాన్ దేవాలయం అని కూడా అంటారు. 1975లో నిర్మితమైన ఈ ఆలయం శ్రీకృష్ణుడు, ఆయన సోదరుడు బలరాముడికి అంకితం చేయబడింది. ఇక్కడ ఉన్న చిత్రాల కళాకృతి ఆకట్టుకుంటుంది.
శ్రీరంగ్జీ ఆలయం
- 1851లో నిర్మించబడిన ఈ ఆలయం బృందావనంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. రంగనాథునికి అంకితం చేయబడింది ఈ శ్రీ రంగ్జీ ఆలయం. ఆలయంలో మీరు దక్షిణ, ఉత్తర శైలి నిర్మాణ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
ప్రేమ్ మందిర్:
- బృందావన్‌లోని ప్రేమ్ మందిర్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. తెల్లని పాలరాతితో నిర్మితమైన ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఇక్కడ గోవర్ధన్ పర్వత లీల, కృష్ణ లీల, ఇంకా శ్రీకృష్ణుడి బాల్యంలోని అనేక ఇతర విషయాలు చూడవచ్చు.
Krishna Brindavanam Temple
కన్స్ క్విలా
కన్స్ క్విలా అద్భుతమైన ఆకర్షణలలో ఒకటి. ఇది యమునా నది ఉత్తర ఒడ్డున ఉంది. దీనిని పురాతన కోట అని అర్ధం పురాణా క్విలా అని కూడా పిలుస్తారు. ఇది నిజంగా హిందూ-ముస్లిం వాస్తుశిల్పం యొక్క అద్భుతమైన కలయిక. మధుర పర్యటనలో ఉన్నప్పుడు దీనిని తప్పక సందర్శించాలి.
0 Comments:
Post a Comment