Khammam: పాప కంటి నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు.. మిస్టరీని చేధించిన డాక్టర్లు.. ట్విస్ట్ ఇదే
కంట్లో చిన్న నలక పడితేనే విలవిల్లాడిపోతామ్. కంట్లో నుంచి నీళ్లు బడబడా కారిపోతాయ్. పొరపాటున ఏదైనా గాయమైతే ఆ బాధ భరించడం ఎంతో కష్టం. అంత నరకంగా ఉంటుందా బాధ.
అయితే, ఈ చిన్నారి కంట్లో నుంచి నాన్‌స్టాప్‌గా పెద్దపెద్ద పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, బియ్యం, పత్తి గింజలు వస్తున్నాయ్. కంట్లో నుంచి అవన్నీ వస్తున్నప్పుడల్లా భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతోంది బాలిక. తన పేరు సౌజన్య, వయసు ఆరేళ్లు, ఉండేది మహబూబాబాద్ జిల్లా కిష్ణాపురం, మూడు నెలలుగా ఈ చిన్నారి కంట్లో నుంచి ప్లాస్టిక్, పేపర్లు, గింజలు… ఇలా ఒక్కటేమిటి… రకరకాల ఐటెమ్స్ వస్తున్నాయ్. కూతురి పరిస్థితిని చూసి ఎంతోమంది డాక్టర్లకు చూపించారు తల్లిదండ్రులు. రాళ్లు రావడం చూశామ్, కానీ ప్లాస్టిక్, పత్తి గింజలు, పెద్దపెద్ద పేపర్లు, బియ్యపు గింజలు రావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నామ్ అంటున్నారు డాక్టర్లు. బాడీ అయితే ప్లాస్టిక్‌ను ప్రొడ్యూస్ చేయదు. మరి అలాంటప్పుడు కంట్లో నుంచి ప్లాస్టిక్ ఎలా వస్తుందో తెలియదని స్థానిక డాక్టర్లు చెప్పడంతో.. పాపను తీసుకుని ఖమ్మం మమతా హాస్పిటల్‌కు వచ్చారు.
బాలిక కంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు, పేపర్లు, గింజలు వస్తుండటం అయితే నిజం. కానీ, అవి ఎలా వస్తున్నాయ్, ఎందుకొస్తున్నాయ్ అన్నదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. అటెక్షన్ గ్రాబ్ చేయడానికి బాలిక ఏమైనా ట్రిక్స్ చేస్తుందా? అనే అనుమానం కూడా తొలుత డాక్టర్లకు కలిగింది. కానీ చిన్న పాప అలా ట్రిక్స్ ఎందుకు చేస్తుంది.. ఎలా చేయగలదు అనుకున్నారు. రోజంతా తమ పర్యవేక్షణలో ఉంచుకుని ఈ మిస్టరీని చేధించారు మమతా ఆస్పత్రి డాక్టర్లు. ఈ పరిస్థితిని బిహేవియరల్ అబ్‌నార్మాలటిగా కన్ఫామ్ చేశారు. పెరిగే వయసు చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఈ పాప ఆటల్లో నిమగ్నమయినప్పుడు.. తన ప్రమేయం లేకుండా.. తనకు తెలియకుండానే పేపర్లు, ప్లాస్టిక్, గోర్లు నమిలి.. మెత్తగా అయిన తర్వాత.. కను రెప్పల్లో పెట్టడం జరుగుతుందని చెప్పారు. గత కొద్ది రోజులుగా బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని.. తాజాగా తమ నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ విషయం బయటపడిందని ఖమ్మం మమతా ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. దీనికి చికిత్స, మెడిసిన్స్ ఏమి లేవని డాక్టర్లు చెప్పారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయత పంచడం ద్వారా.. ఈ లక్షణాలు తగ్గుతాయని డాక్టర్లు వివరించారు.
0 Comments:
Post a Comment