Karnataka Election Results 2023: కర్ణాటక కాంగ్రెస్‌లో మొదలైన CM కుర్చీ ఫైట్! గెలిచినా కాంగ్రెస్‌కు ఇబ్బందులే!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించిందే జరిగింది.
కన్నడ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో.. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించింది. 130 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీ పొందింది. దేశవ్యాప్తంగా ప్రభావం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక విజయం మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలతో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ పార్టీ అనే క్లారిటీ వచ్చింది. దాంతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా.. అధిష్టానం మాత్రం కొత్త తలనొప్పిని ఎదుర్కొబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం కావడంతో.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. సీఎం క్యాండెట్ ఎవరు అనే దానిపై ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు.
పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్ట రెండు వర్గాలుగా చీలినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సీఎం కుర్చీ కోసం ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అసెంబ్లీలో ప్రతి
పక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు ముఖ్యమంత్రి పదవిని ఆశించే నేతల జాబితాలో తొలి వరుసలో నిలుస్తున్నారు. వరుణ నియోజకవర్గంలో శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి ఆయనే గట్టి పోటీదారు అని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు సిద్ధరామయ్య స్థానంలో తానే ముఖ్యమంత్రి కావాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇప్పటికే పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. అయితే సీఎం అభ్యర్థి ఎన్నిక కోసం ఓటింగ్‌కి వెళ్లడం మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేల ఓటింగ్ ఆధారంగా సీఎం క్యాండెట్‌ని ఎంపిక చేయడం మంచిదని పార్టీ హైకమాండ్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇష్టపడే వారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలని సిద్ధరామయ్య హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చారని పార్టీ వర్గాల సమాచారం. మరి ఈ ఇద్దరు నేతల్లో ఎవరు సీఎం పదవి దక్కించుకుంటారో.. వీరి మధ్య పోటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి అటున్నారు రాజకీయ విశ్లేషకులు.
0 Comments:
Post a Comment