Recipe: ఆరోగ్యాన్నిచ్చే కాకరతో.. కేరళ కర్రీ 'తోరన్' తయారీ ఇలా! ఒక్కసారి తింటే..
Kakarakaya Health Benefits: కాకర డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు... వాపులను తగ్గిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది... మంచి ఊపిరినిస్తుంది. కళ్లు... ఎముకలు... లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. సెల్ డ్యామేజ్‌ని అడ్డుకుని చర్మానికి మేలు చేస్తుంది. ఇన్ని 'మేళ్లు' చేయడం కాకరకాయకే సాధ్యం. అందుకే... ఈ చేదు రుచులను స్వాగతిద్దాం. ఈ వారం మన 'వంటిల్లు'ను కాకరకు వేదిక చేద్దాం.
తోరన్...
కావలసినవి:
►కాకరకాయలు - అర కేజీ
►పచ్చి కొబ్బరి తురుము - పావు కేజీ
►పచ్చి మిర్చి- 10 (సన్నగా తరగాలి)
►బెల్లం లేదా బెల్లం పొడి- 3 టేబుల్ స్పూన్‌లు
►ఉప్పు - టీ స్పూన్
►పసుపు- అర టీ స్పూన్
►కరివేపాకు - 2 రెమ్మలు
►నూనె- 5 టేబుల్ స్పూన్‌లు.
తయారీ:
►కాకరకాయలను శుభ్రంగా కడగాలి. చివరలు తొలగించి కాయను నిలువుగా చీల్చాలి.
►స్పూన్‌తో కాయలోని గింజలను, మెత్తటి భాగాన్ని తీసేయాలి. కాయ పై భాగాలను చిన్న ముక్కలుగా తరగాలి.
►ఈ ముక్కలను మందపాటి పాత్రలో వేయాలి. అందులో బెల్లం, పచ్చిమిర్చి తరుగు, కొబ్బరి తురుము వేసి (నీరు పోయకుండా) సన్న మంట మీద ఉడికించాలి.
►కొద్దిగా వేడెక్కిన తర్వాత పసుపు, పసుపు, నూనె కూడా వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి.
►ఆ తరవాత తరచూ కలుపుతూ ఉడికించాలి.
►అవసరం అనిపిస్తే మరికొద్దిగా నూనె వేయాలి.
►కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
►ఈ కేరళ కర్రీ అన్నంలోకి రొట్టెల్లోకి కూడా మంచి కాంబినేషన్.
0 Comments:
Post a Comment