Job Mela in AP: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. 800లకు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.వివరాలివే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 12న మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
విద్యార్హతల వివరాలు:
టెక్ మహింద్ర:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. డిగ్రీ, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
పేటీఎం:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 వరకు వేతనం చెల్లించనున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.
డెక్కన్ ఫైన్ కెమికల్స్:ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వేతనం ఉంటుంది.
అపోలో ఫార్మసీ:ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, డిగ్రీ, బీ/ఎం/డీ ఫార్మసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,094 నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.
ఈ సంస్థలతో పాటు మరో 8 ప్రముఖ సంస్థల్లోనూ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.9 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంటుంది.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు జీబీఆర్ డిగ్రీ కాలేజీ, దుప్పులపుడి రోడ్, అనపర్తి చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- ఈ ఇంటర్వ్యూలను ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఫార్మల్ డ్రస్ తో రావాల్సి ఉంటుంది. Resume తో పాటు విద్యార్హతల సర్టిఫికేట్ల కాపీలను తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment