IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.లక్షకు పైగా జీతం..!
IOCL Recruitment: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్. మహారత్న హోదా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారీ వేతనంతో రిఫైనరీ/పెట్రోకెమికల్ యూనిట్లలో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హులైన అభ్యర్థులు IOCL అధికారిక పోర్టల్ https://iocl.com/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇందుకు గడువు మే 30న ముగియనుంది.
పశ్చిమ బెంగాల్‌లోని హాల్దియా, గుజరాత్‌లోని వడోదరలో ఉన్న రిఫైనరీ/పెట్రోకెమికల్ యూనిట్లలో వివిధ విభాగాల్లో 65 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను (జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV) IOCL భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఖాళీల వివరాలు
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (ప్రొడక్షన్)
వడోదర-47, హల్దియా-7
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (P&U )
గుజరాత్-7, హల్దియా-4
* అర్హత ప్రమాణాలు
- జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ప్రొడక్షన్)
కెమికల్ ఇంజినీర్/పెట్రోకెమికల్ ఇంజినీర్/కెమికల్ టెక్నాలజీ/ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. లేదా (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో మూడేళ్ల బీఎస్సీ చేసి ఉండాలి.
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV (P&U)
మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజీనిరింగ్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) చేసి ఉండాలి.
* అప్లికేషన్ ప్రాసెస్
IOCL అధికారిక పోర్టల్ https://iocl.com/ విజిట్ చేయాలి. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్‌ను ఫిలప్ చేయాలి. తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించి.. ప్రివ్యూ చూసిన తరువాత సబ్‌మిట్ చేయాలి.
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. వీటిలో అప్లికేషన్ ఫారమ్ ప్రింటౌట్, ఫోటోగ్రాఫ్, పదో తరగతి మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
* ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎగ్జామ్‌లో స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ మూడు విభాగాలకు వరుసగా 75, 15, 10 మార్కులను కేటాయిస్తారు. స్కిల్ టెస్ట్‌కు అర్హత సాధించాలంటే రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష జూన్ 11న నిర్వహించి ఫలితాలను జూన్ 27న వెల్లడిస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 25,000 నుంచి 1,05,000 వరకు ఉంటుంది.
నోటిఫికేషన్ ప్రకారం.. గుజరాత్‌లోని రిఫైనరీ యూనిట్‌లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష వడోదరలో నిర్వహించనున్నారు. హల్దియా రిఫైనరీలో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష కోల్‌కతాలో జరుగుతుంది.అభ్యర్థులకు జారీ చేసే అడ్మిట్‌కార్డ్‌లో ఎగ్జామ్ సెంటర్ పూర్తి వివరాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు IOCL అధికారిక పోర్టల్ విజిట్ చేయవచ్చు.
0 Comments:
Post a Comment