Indian Railways: ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది? రైలు బోగి బుక్ చేసుకోవాలంటే ఎంత కట్టాలి?
Railways | మనం ట్రైన్ జర్నీ తరుచుగానే చేస్తూ ఉంటాం.
చాలా మంది జనరల్ టికెట్ తీసుకుంటూ ఉండొచ్చు. లేదంటే స్లీపర్ కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏసీ కోచ్ బుకింగ్స్ కూడా ఉంటాయి. అయితే అందరూ ఎక్కువగా జనరల్, సీటింగ్ లేదంటే స్లీపర్ ఈ టికెట్లనే బుక్ చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు.
అయితే ట్రైన్‌లో కుటుంబాలు కలిసి జర్నీ చేయాల్సి వస్తే.. అప్పుడు ట్రైన్ బోగి లేదా కోచ్ మొత్తం బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రైన్ మొత్తం బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆంధ్రావాలా ఫంక్షన్ సమయంలో మనం ఇలాంటివి చూసే ఉంటాం.
మరి ట్రైన్ బోగి మొత్తం బుక్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? లేదంటే ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలంటే ఎంత కట్టాలి? వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఫుల్ టారిఫ్ రేట్ (ఎఫ్‌టీఆర్) సర్వీసుల కింద ట్రైన్ మొత్తాన్ని లేదంటే ట్రైన్‌లో బోగిని బుక్ చేసుకునే వెసులుబాటు ప్రయాణికులకు ఉంటుంది. అయితే దీని కన్నా ముందు స్పెషల్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం https://www.ftr.irctc.co.in/ftr/ సైట్‌లోకి వెళ్లాలి.
మీరు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. మీకు ఇక్కడ ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలా? లేదంటే ఒక కోచ్ బుక్ చేసుకోవాలా? అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. తర్వాత అవసరమైన వివరాలు అందించాలి.
జర్నీ ఎప్పుడు? ఏ కోచ్ ఎంచుకుంటున్నారు? వంటి సమాచారం అందించాల్సి వస్తుంది. తర్వాత పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోచ్ మొత్తం బుక్ చేసుకునే వారు రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవడం ఉత్తమం.
ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, ఏసీ చెయిర్ కార్, స్లీపర్ ఇలా మీకు నచ్చిన బోగిని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ రూల్స్ ప్రకారం చూస్తే.. మీరు 30 నుంచి 35 శాతం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది.
మీ జర్నీ ముగిసిన తర్వాత ఈ డబ్బులను మీకు మళ్లీ వెనక్కి చెల్లిస్తారు. మీరు ఒక కోచ్ బుక్ చేసుకోవాలని భావిస్తే.. రూ. 50 వేల వరకు పడుతుందని చెప్పుకోవచ్చు. మీరు జర్నీచేసే ప్రాంతం, దూరం ప్రాతిపదికన ఈ మొత్తం మారొచ్చు.
అలాగే ఒకవేళ మీరు మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తే.. అప్పుడు ఏకంగా రూ. 9 లక్షల వరకు పడొచ్చు. అయితే మీరు ఈ రిజర్వేషన్‌ను 30 రోజుల నుంచి 6 నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment