Indian Navy jobs:10వ తరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు..నెలకు రూ.30వేల జీతం
Indian Navy: ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఇండియన్ నేవీ(Indian navy) ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది.
స్టీవార్డ్, చెఫ్, శానిటరీ హైజీనిస్ట్ వంటి జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ నేవీ మెట్రిక్ రిక్రూట్‌మెంట్ (MR) పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో చెఫ్, స్టీవార్డ్, శానిటరీ హైజీనిస్ట్ పోస్టులు ఉన్నాయి. MR రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో (www.joinindiannavy.gov.in) అందుబాటులో ఉంది. అభ్యర్థులు ఇక్కడి నుంచి అవసరమైన వివరాలను పొందవచ్చు.
* అర్హత
MR రిక్రూట్‌మెంట్‌కు అర్హత పొందేందుకు, అభ్యర్థులు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. భారత నౌకాదళంలో జాబ్స్ కోసం నిర్దిష్ట వయస్సు అవసరం.
* ఎంపిక ప్రక్రియ
MR రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు,ఫిజికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి. అభ్యర్థులు ఆయా స్థానాలకు జరిగిన టెస్ట్‌లలో చూపించే ప్రతిభ ఆధారంగా వారి పనితీరును ఎవాల్యువేట్ చేస్తారు.
* ఆకట్టుకునే వేతనాలు, ప్రయోజనాలు
MR అగ్నివీర్‌గా ఇండియన్ నేవీలో చేరడానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటి జీతం. మొదటి సంవత్సరంలో, జీతం నెలకు రూ.30,000గా నిర్ణయించారు. అందులో రూ.21,000 చేతికి అందుతుంది. అయితే రూ.9,000 (జీతంలో 30%) శాలరీ కార్పస్ ఫండ్‌లో జమ అవుతుంది. జీతం సంవత్సరాలు గడిచేకొద్దీ క్రమంగా పెరుగుతుంది, నాలుగో సంవత్సరంలో రూ.40,000కి చేరుకుంటుంది. అయితే జీతంలో 30% ప్రతి సంవత్సరం జీతం కార్పస్ ఫండ్‌లో స్థిరంగా జమ అవుతుందని గమనించాలి. నాలుగు సంవత్సరాల తర్వాత, ఒక అగ్నివీర్ దాదాపు రూ.10.04 లక్షలను అందుకోవచ్చు. ప్రభుత్వం సంబంధిత ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌కి సమానమైన మొత్తాన్ని అందజేస్తుంది. జీతంతో పాటు, ఇండియన్ నేవీ సిబ్బందికి వివిధ ప్రోత్సాహకాలు, ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
* బాధ్యతలు
ఎ) చెఫ్ MR: ఇండియన్ నేవీలో చెఫ్‌గా చేరితే, అభ్యర్థులు శాకాహారం, మాంసాహారం సహా మెను ప్రకారం భోజనం సిద్ధం చేయాల్సి ఉంటుంది. రేషన్ మేనేజ్‌మెంట్‌లో కూడా భాగం కావాలి. ఇతర కేటాయించిన విధులతో పాటు తుపాకీ శిక్షణ పొందుతారు.
బి) స్టీవార్డ్ MR
అధికారుల మెస్ సౌకర్యాలలో స్టీవార్డ్‌లు కీలక పాత్ర పోషిస్తారు. వెయిటరింగ్, హౌస్ కీపింగ్, మనీ, రియు ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, మెనూ క్రియేషన్ సహా అనేక రకాల బాధ్యతలను నిర్వహిస్తారు. స్టీవార్డ్‌లు మెస్ సౌకర్యాల సజావుగా పనితీరును నిర్ధారిస్తారు, ఉన్నత ప్రమాణాలతో సేవలు అందేలా చూస్తారు.
సి) శానిటరీ హైజీనిస్ట్ MR
శానిటరీ హైజీనిస్ట్‌లుగా చేరిన అభ్యర్థులకు విశ్రాంతి గదులు, ఇతర ప్రదేశాలలో పరిశుభ్రతను నిర్ధారించే బాధ్యతను అప్పగించారు. నావికా నౌకలు లేదా సంస్థలలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడటం వీరి పని.
0 Comments:
Post a Comment