Hypertension: మొబైల్‌లో 30 నిమిషాలకన్నా ఎక్కువ మాట్లాడితే హై బీపీ
Hypertension: 30 నిమిషాల కన్నా ఎక్కువ టైం మాట్లాడితే.. వారిలో హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ స్టడీ తేల్చింది. చైనా వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని తన రిపోర్టులో రాశారు.
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌లో మీరెంత సేపు మాట్లాడుతున్నారు? మీ ముచ్చట్లు వారానికి 30 నిమిషాలు దాటేస్తుందా? అయితే మీరు హై బీపీ(hypertension) రిస్క్‌లో ఉన్నట్లే. వారానికి 30 నిమిషాలు మొబైల్‌లో మాట్లాడిన వారిలో.. 12 శాతం హై బీపీ వచ్చే ఛాన్సు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా తక్కువ స్థాయిలో రేడియోఫ్రీక్వెన్సీ ఎనర్జీ రిలీజవుతుందని, ఆ ఎనర్జీ వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందని స్టడీలో తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలకు హైపర్‌టెన్షన్ ముఖ్య కారణమన్న విషయం తెలిసిందే.
చైనాలోని గాంగ్జూలో ఉన్న సదరన్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్జియాన్‌వూ క్విన్ ఈ అంశంపై రిపోర్టును తయారు చేశారు. మొబైల్ ఫోన్ ఎంత సేపు మాట్లాడారన్న అంశంపై గుండె ఆరోగ్య స్థితి ఆధారపడి ఉంటుందని అన్నారు. ఒకవేళ ఎక్కువ సేపు మొబైల్‌లో మాట్లాడితే అప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుందని రచయిత క్విన్ తెలిపారు. యురోపియన్ హార్ట్ జనరల్ .. డిజిటల్ హెల్త్‌లో ఈ రిపోర్టును పబ్లిష్ చేశారు.
ఫోన్ల ద్వారా హైపర్‌టెన్షన్ స్టడీ నిర్వహించారు. యూకే బయోబ్యాంక్ ఆ డేటాను సేకరించింది. 37 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 2,12,046 మందిపై ఈ స్టడీ చేపట్టారు. మొబైల్ ఫోన్‌లో వారానికి 30 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడేవారిలో 12 శాతం అధికంగా హైబీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, మహిళలైనా పురుషులైనా ప్రమాదం అంతే ఉంటుందని సర్వేలో తేల్చారు. వారంలో గంట లోపు మాట్లాడేవారికి 8 శాతం, మూడు గంటల పాటు ఫోన్లో మాట్లాడేవారికి 13 శాతం, ఆరు గంటలు మాట్లాడేవాళ్లకు 16 శాతం, ఆరు కన్నా ఎక్కువ గంటలు మాట్లాడేవారికి 25 శాతం హైబీపీ వచ్చే ఛాన్సు ఉంది. ఇక జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో హైబీపీ 33 శాతం అధికంగా ఉంటుందన్నారు.
0 Comments:
Post a Comment