Human Thoughts:- ఈరోజుల్లో అడ్వాన్స్ అవుతున్న టెక్నాలజీ వల్ల మనిషికి ఏ రకంగా కూడా ప్రైవసీ అనేది లేకుండా పోతుంది.
స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా యాప్స్ అనేవి ప్రైవసీ విషయంలో యూజర్లకు భరోసా ఇస్తున్నా కూడా ఏదో ఒక విధంగా అవి యూజర్ల డేటాను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి.
అదే విధంగా ఇప్పుడు మనుషులకు ఆలోచనలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోతోంది. తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక టెక్నాలజీ మనిషి ఆలోచనలకు ప్రైవసీ లేకుండా చేస్తుంది.
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీల సాయంతో మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో కనుక్కోగలుగుతున్నాం, హార్ట్ రేటు ఎంత ఉందని కనిపెట్టగలుగుతున్నాం.. అలాగే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నకొద్దీ బ్రెయిన్ వేవ్స్‌ను కూడా స్టడీ చేయగలుగుతున్నాం.
ప్రస్తుతం బ్రెయిన్ సెన్సార్లు అనేవి బ్రెయిన్ వేవ్స్‌ను స్టడీ చేసి వాటిలో ఉండే ఆలోచనలను కనిపెట్టడానికి ఉపయోగపడుతున్నాయి. కొన్ని ప్రపంచ దేశాల్లో బ్రెయిన్ సెన్సార్లను కదలలేని, మాట్లాడలేని పేషెంట్లపైనే ఉపయోగిస్తున్నారు. కానీ త్వరలోనే ఈ సెన్సార్లను అందరి ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
బ్రెయిన్ వేవ్స్‌ను స్టడీ చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో ఒకటి కాదు ఎన్నో రకాల పరికరాలు ఉన్నాయి. హెడ్‌బ్యాండ్స్, సెన్సార్ల రూపంలో ఇప్పటికే ఇవి కమర్షియల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
ఒక క్యాప్ ఆకారంలో ఉండే ఈ సెన్సార్లు బ్రెయిన్‌లోని ప్రతీ యాక్టివిటీని ట్రాక్ చేస్తాయి. ప్రస్తుతం ఈ సెన్సార్లలో పొందుపరిచిన ఆల్గరిథంలు పూర్తిస్థాయిలో బ్రెయిన్ యాక్టివిటీ స్టడీకి ఉపయోగపడడం లేదని, మరింత మెరుగ్గా వీటిని తయారు చేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ప్రస్తుతం ఉన్న బ్రెయిన్ సెన్సార్లు మనుషులు ముఖ్యమైన యాక్టివిటీస్‌ను మాత్రమే కనిపెడుతున్నాయి. అలా కాకుండా మనిషి ఆలోచించే ప్రతీ చిన్న విషయం వారికి తెలిసే విధంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
ఎలాగైతే హార్ట్ బీట్‌ను తెలుసుకోవడం కోసం గ్యాడ్జెట్స్ తయారయ్యయో.. అచ్చం అదే విధంగా బ్రెయిన్‌లోని ఆలోచనలను కూడా తెలుసుకోవడానికి గ్యాడ్జెట్లు తయారు చేయడానికి ఎన్నో ప్రైవేట్ కంపెనీలు శాస్త్రవేత్తల పరిశోధనల్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు.
బ్రెయిన్ వేవ్స్‌ను సెన్సార్ల ద్వారా కనిపెడుతూ ఉండడం
వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పలు రకాలుగా మనిషికి ప్రైవసీ లేకుండా పోతుందని, ఇక గ్యాడ్జెట్ల ద్వారా మనిషి ఆలోచనలను కూడా తెలుసుకోగలిగితే.. పూర్తిగా మనిషి అనేవాడికి ప్రైవసీ అనేది దూరం అవుతుందని వాదనలు వినిపిస్తున్నారు.
అయినా కూడా శాస్త్రవేత్తలు 2025 లోపు ఇలాంటి బ్రెయిన్ సెన్సార్ గ్యాడ్జెట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
0 Comments:
Post a Comment