Healthy Lifestyle: రాత్రి పడుకునే ముందు ఇవి తినవద్దు,తాగవద్దు..హెల్త్‌కు రిస్క్ అంటున్న డాక్టర్లు
చాలా మందికి తెలిసో, తెలియకో పడుకునే ముందు తినకూడని కొన్ని పదార్ధాలను తింటారు.
కొన్ని డ్రింక్స్ కూడా నిద్రపోయే ముందు తాగడం మంచిది కాదు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. అందుకే పడుకునే ముందు ఎలాంటి ఆహారపదార్థాలు, డ్రింక్స్ తీసుకోకూడదో మీరు కూడా తెలుసుకోవాలి.
ఎవరైనా సరే పడుకునే ముందు చాక్లెట్ అసలు తినకూడదు. చాక్లెట్‌లో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎవరికైనా రాత్రి వేళలో గాఢంగా నిద్రపోకపోతే వారి శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు.
రాత్రి పడుకునే ముందు కొన్ని మందు బిళ్లలు(టాబ్లెట్స్) వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది.
టమోటాలు తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. పడుకునే ముందు టొమాటో తినకూడదు.దీనివల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది. దీన్ని తినడం వల్ల రాత్రిపూట అజీర్తి చేస్తుంది. ఇది నిద్రపట్టకుండా చేస్తుంది.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కాని రాత్రి వేళ నిద్రపోయే ముందు ఉల్లిపాయ తింటే అంతంటే ప్రమాదం మరొకటి ఉండదు. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఉల్లి కడుపులో గ్యాస్ట్రిటిస్‌కు కారణమవుతుంది. పడుకునే ముందు తింటే నిద్రకు భంగం కలిగిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు. పడుకునే ముందు ఒక గ్లాసు ఈ జ్యూస్ తీసుకుంటే నిద్రలేమి సమస్య నయమవుతుంది. చాలా పండ్లలో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, చాలా మంది ప్రజలు వినోదం కోసం మద్యం తాగుతారు. అయితే రాత్రి పడుకునే ముందు మద్యం సేవించకూడదు. ఇది శరీరాన్ని మరింత దిగజార్చుతుంది.
0 Comments:
Post a Comment