Healthy Brain: మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే మెదడు ఆరోగ్యాన్ని (Brain Health) కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలోని మొత్తం విధులకు చాలా కీలకమైనది మెదడు.
అందుకే వైద్య నిపుణులు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే మెదడు వాపును నివారించవచ్చు.
మెదడు కణాలు, నరాలను బలంగా ఉంచుకోవచ్చు. తద్వారా బ్రెయిన్ ఫంక్షనాలిటీ మెరుగ్గా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే తీసుకోవాల్సిన విటమిన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
* విటమిన్ B1
హార్వర్డ్‌లోని పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఉమా నాయుడు ప్రకారం, విటమిన్ B1 మెదడు కణాల ఆరోగ్యం, పనితీరుకు, అలాగే మెదడు మొత్తం మెటబాలిజానికి చాలా కీలకం.
మెదడు శరీరంలో అత్యంత చురుకైన అవయవాలలో ఒకటి కాబట్టి, విటమిన్ B1 దాని పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. థయామిన్ అని కూడా పిలిచే విటమిన్ B1 కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో దోహదపడుతుంది.
మెదడు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే ఈ విటమిన్‌ను బ్రౌన్ రైస్, ఓట్స్, కాయధాన్యాలు, బ్లాక్ బీన్స్, బఠానీలు, పాలు, పెరుగు వంటి ఆహారాల ద్వారా పొందవచ్చు.
* విటమిన్ B6
విటమిన్ B6 వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలో, మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన కెమికల్ రియాక్షన్లను సులభతరం చేస్తుంది.
చికెన్, పంది, గొడ్డు మాంసం, సాల్మన్, ట్యూనా చేపలు, బచ్చలికూర, బంగాళదుంపలు, అరటి పండ్లు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలలో విటమిన్ B6 లభిస్తుంది.
* విటమిన్ B2
డాక్టర్ ఉమా ప్రకారం, రిబోఫ్లావిన్ అని కూడా పిలిచే విటమిన్ B2 మెదడు కణాలలో ఎంజైమ్ ప్రతిచర్యలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్, సాల్మన్, ట్రౌట్ వంటి చేపలు, పాలకూర, ఇతర ఆకుకూరలు, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, సోయాబీన్స్ వంటి ఫుడ్స్‌లో విటమిన్ B2 పుష్కలంగా లభిస్తుంది.
* విటమిన్ B5
శరీరంలో కొవ్వు ఆమ్లాలను శక్తిగా మార్చే పరమాణు సమ్మేళనం అయిన కోఎంజైమ్ ఏర్పడటంలో విటమిన్ B5 కీలక పాత్ర పోషిస్తుంది. మెదడులో ఎక్కువగా కొవ్వు ఉంటుంది కాబట్టి, మెదడు ఆరోగ్యానికి, పనితీరుకు విటమిన్ B5 అవసరం.
* విటమిన్ B3
విటమిన్ B3 కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేయడంలో, కొవ్వును శరీరంలో శక్తిగా మార్చడంలో దోహదపడే సుమారు 400 ఎంజైమ్‌లను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నియాసిన్ అని కూడా పిలిచే విటమిన్ B3 యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మెదడులో ఇన్‌ఫ్లమేషన్ నివారించడంలో తోడ్పడుతుంది.
మజ్జిగ, బీన్స్, సాల్మన్ చేపలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయలతో పాటు రోజూ ఒక గుడ్డు తినడం ద్వారా బి విటమిన్లు పొందవచ్చు.
0 Comments:
Post a Comment