Gold State Coach: పట్టాభిషేకం తర్వాత గోల్డ్ స్టేట్ కోచ్‌లో చార్లెస్ దంపతులు ఊరేగనున్నారు. ఈ రథాన్ని 1830 నుంచి ఊరేగింపు వేడుకల్లో వాడుతున్నారు.
సుమారు 1.6 కిలోమీటర్ల దూరం ఈ ఊరేగింపు జరగనున్నది.
లండన్: కింగ్ చార్లెస్ దంపతులు పట్టాభిషేకం తర్వాత గోల్డ్ స్టేట్ కోచ్(Gold State Coach) రథంలోనే ఊరేగనున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఈ రథంలోనే చార్లెస్ దంపతులు వెళ్లనున్నారు.
అత్యంత వైభవ రీతిలో ఈ ఊరేగింపు కార్యక్రం జరగనున్నది. సుమారు 1.6 కిలోమీటర్ల దూరం ఈ ఊరేగింపు జరగనున్నది. దాదాపు నాలుగు వేల మంది సైనికులు పహారా కాయనున్నారు.
ఈ వేడుకలో 19 మిలిటరీ బ్యాండ్లు పాల్గొంటున్నాయి. ఊరేగింపు కోసం భారీ స్థాయిలో రిహార్సల్స్ చేశారు.
1830 నుంచి పట్టాభిషేక సమయాల్లో ఉరేగింపు కోసం ఈ రథాన్నే వాడుతున్నారు. అశ్వాలు ఈ రథాన్ని లాక్కెళ్లనున్నాయి. తొలుత బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు వెళ్తారు.
అయితే ఆ జర్నీ కోసం డైమెండ్ జూబ్లీ స్టేట్ రథాన్ని వాడనున్నారు. లండన్‌లోని ద మాల్, వైట్‌హాల్ రూట్లో ఈ ఊరేగింపు జరగనున్నది.
సుమారు 2.1 కిలోమీటర్ల దూరం ఊరేగింపు ఉంటుంది. 70 ఏళ్ల క్రితం క్వీన్ ఎలిజబెత్ ఊరేగింపు రూటుతో పోలిస్తే ఇది తక్కువే. అప్పట్లో 8 కిలోమీటర్లు మేర ఊరేగింపు నిర్వహించారు.
0 Comments:
Post a Comment