Gold News: పసిడి ప్రియులకు కేంద్రం షాక్.. ఆ బంగారు ఆభరణాలు అమ్మటం కుదరదు..!
భారతదేశంలో పసిడికి ఉండే ఆధరణ కారణంగా దానిపై ఎల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెడుతూనే ఉంది. వాటి క్రయవిక్రయాలను క్రమబద్ధీకరించేందుకు అనేక కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది.
ఈ క్రమంలో తాజాగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు సామాన్యులకు కొత్త కష్టాలను తీసుకురానున్నాయి. దేశంలోని అనేక కుటుంబాలకు బంగారు ఆభరణాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై వారు తమ పాత బంగారు ఆభరణాలను విక్రయించటం లేదా మార్పిడి చేయలేరు. వాస్తవానికి హాల్ మార్కింగ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం దేశంలో తప్పనిసరి చేయడం వల్లే ఈ సంక్షోభం తలెత్తింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి బంగారం స్వచ్ఛత కోసం హాల్‌మార్కింగ్ నియమాన్ని తప్పనిసరి చేసింది. దీనితో పాటు గోల్డ్ ఆర్ణమెంట్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోగో, స్వచ్ఛత గుర్తును కలిగి ఉండటం కూడా తప్పనిసరి అయింది. ఇది సామాన్య పసిడి ప్రియులను మోసాల నుంచి రక్షిస్తుంది. దీంతో కొనుగోలుపై స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఇంట్లో ఉన్న పాత హాల్ మార్కింగ్ లేని ఆభరణాలను విక్రయించటం లేదా మార్పిడి చేసుకోవటం గురించే.
BIS ప్రకారం హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను కలిగి ఉన్న వినియోగదారులు దానిని విక్రయించే ముందు లేదా కొత్త ఆభరణాల కోసం మార్చుకునే ముందు తప్పనిసరిగా హాల్‌మార్క్ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం దగ్గర లోని బీఐఎస్ నమోదిత బంగారు వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఆభరణాలను హాల్‌మార్కింగ్ కోసం BHISH అప్రైజల్ మరియు హాల్‌మార్కింగ్ సెంటర్‌కు తీసుకువెళతారు. ఒక్కో వస్తువుకు కేవలం రూ.45 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు నాలుగు కంటే ఎక్కువ ఆభరణాలు ఉంచుకుంటే రూ.200 చార్జీ ఉంటుంది.
ఎవరికి ఉపశమనం లభిస్తుందంటే..:ఇందులో కొందరికి ఉసపమనం కూడా ఉంది. 2 గ్రాముల కంటే తక్కువ బరువున్న బంగారు ఆభరణాలపై ఉపశమనం లభిస్తుంది. విదేశీ ఎగుమతుల కోసం తయారు చేసిన వస్తుతవులు. దేశంలో లేదా విదేశాల్లో ప్రదర్శన కోసం ప్రభుత్వ ఆమోదంతో తయారు చేసిన ఆభరణాలు మెడికల్, డెంటల్, వెటర్నరీ, సైంటిఫిక్ లేదా ఇండస్ట్రియల్ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏదైనా ఆర్టికల్. బంగారు గడియారాలు, ఫౌంటెన్ పెన్నులు, ప్రత్యేక నగలు మొదలైన వాటికి ఉపసమనం లభిస్తుంది. పైగా పాత హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాల పరిశీలన కోసం BIS ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.
0 Comments:
Post a Comment