Gold News: కల్తీ లేని బంగారం, వెండి.. ప్రభుత్వ మింట్ నుంచి నేరుగా కొనండిలా..!
Gold News: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది తమ డబ్బును సురక్షితమైన స్వర్గంగా భావించే బంగారంలోకి మళ్లిస్తున్నారు.పైగా భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న సంబంధం విడదీయలేనిది.
ఈ క్రమంలో బంగారం, వెండి కొనుగోలును సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు ఇప్పుడు నేరుగా భారత ప్రభుత్వ మింట్ నుంచి గోల్డ్, సిల్వర్ నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో పసిడి ప్రియులు 2.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు నాణాల ధరలను కనుగొనవచ్చు.
ఎవరైనా స్వచ్ఛమైన బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు నేరుగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. దేశంలోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, నోయిడా, కోల్‌కతాలోని ఐదు ప్రదేశాల్లో ఉన్న మింట్ విక్రయ కేంద్రాలను సందర్శించి నేరుగా కొనుగోలు చేయవచ్చు. అలాగే భారతీయ ప్రభుత్వ మింట్ అధికారిక వెబ్‌సైట్ www.indiagovtmint.in నుంచి వినియోగదారులు బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నగదు చెల్లింపు ఆప్షన్లను వినియోగించుకునేందుకు వెసులుబాటు ఉంది.
భారత ప్రభుత్వ మింట్‌లో ముద్రించి దేశంలో విక్రయించబడే నాణేలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) హాల్‌మార్క్ ప్రకారం నాణ్యత ధృవీకరణను పొందుతాయి. నాణేలు 24-క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను కలిగి ఉంటాయి. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తూ.. పెట్టిన పెట్టుబడి మెుత్తాన్ని స్థిరంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియోలో బంగారం, వెండి వంటి లోహాలను చేర్చుకుంటుంటారు.
0 Comments:
Post a Comment