1. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి, బ్యాంకుల్లో రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకునేవారికి సిబిల్ స్కోర్ (CIBIL Score) చాలా ముఖ్యం.
గతంలో సిబిల్ స్కోర్‌ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు తమ క్రెడిట్ స్కోర్ (Credit Score) ఎంతో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. పలు సంస్థలు ఉచితంగా సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంటాయి. ట్రాన్స్‌యూనియన్ సంస్థ కూడా ఏడాదికి ఓసారి ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ఇప్పుడు గూగుల్ పే (Google Pay) యాప్‌లో కూడా ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే ఆప్షన్ వచ్చేసింది. మీ సిబిల్ స్కోర్ ఎంతో మీకు ఇప్పటికే తెలిసినట్టైతే ఈ క్రెడిట్ స్కోర్ పెరగడానికి కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
3. గూగుల్ పే భారతదేశంలో యూపీఐ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్, పేమెంట్స్‌తో పాటు ఇతర సేవల్ని కూడా అందిస్తోంది. పర్సనల్ లోన్ తీసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే ఆప్షన్ ఇస్తోంది. మరి గూగుల్ పే యాప్‌లో ఉచితంగా సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. గూగుల్ పే యాప్‌లో సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి ముందుగా మీ గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. Manage Your Money సెక్షన్‌లో Check CIBIL score for free పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ట్రాన్స్‌యూనియన్ దగ్గర ఉన్న మీ డేటా ప్రకారం మీ సిబిల్ స్కోర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ కనిపించనట్టైతే మీరు ఇప్పటి వరకు ఎలాంటి రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోలేదని అర్థం. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ రావాలంటే లోన్ లేదా క్రెడిట్ కార్డుకు అప్లై చేయాలి. గూగుల్ పే ప్లాట్‌ఫామ్‌లోనే వేర్వేరు సంస్థలు రూ.5,00,000 వరకు రుణాలు ఇస్తున్నాయి. అక్కడే రుణాలకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. సిబిల్ స్కోర్ అంటే ఒక వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా పాటించే వారికి మంచి సిబిల్ స్కోర్ ఉంటుంది. సిబిల్ స్కోర్ మూడు అంకెల నెంబర్. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 పైన సిబిల్ స్కోర్ ఉంటే మంచిది అని చెబుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment