Eyes Health: సమ్మర్ హీట్ కళ్లకు డేంజర్..బయటికి వెళ్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Eyes Health: ఎండాకాలంలో(Summer) కొన్ని ఇన్ఫెక్షన్లు సోకడం సర్వసాధారణం. ఈ సమయంలో ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వకపోతే ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి.
ముఖ్యంగా కళ్లు తీవ్రమైన సూర్యకాంతి వల్ల ప్రభావితమవుతాయి. వేసవిలో ఎక్కువగా కనిపించే ఒక సాధారణ కంటి వ్యాధి కండ్లకలక. మనల్ని మనం రక్షించుకోవడానికి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, మన కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వేసవిలో యూవీ కిరణాలకు అధికంగా గురికావడం వల్ల కళ్ళకు హాని కలుగుతుంది. ఇది కంటిశుక్లం ఏర్పడటానికి, దృష్టి క్షీణతకు, రెటీనా దెబ్బతినడానికి కారణం అవుతుంది.
ఎక్కువసేపు స్క్రీన్లు చూడటం వల్ల కళ్ళు పొడిబారడానికి కారణమవుతుంది. ఫలితంగా కళ్లు ఎరుపు ఎక్కుతాయి. కళ్లలో నుంచి నీరు కారుతుంది. అవి అసౌకర్యానికి కూడా గురవుతాయి. యూవీ కిరణాలు బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా వంటి క్యాన్సర్ వచ్చే స్థాయిలో రెటీనాను కూడా దెబ్బతీస్తుంది. దీనికి నివారణ మార్గాలు సూచిస్తున్నారు కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లో క్లినికల్ ప్రొఫెసర్, ఆప్తాల్మాలజీ హెడ్ డాక్టర్ గోపాల్ పిళ్లై. ఇండియా టుడే పబ్లిష్ చేసిన వివరాలు..
* జాగ్రత్తలు
సూర్యుడి నుంచి మన కళ్లను రక్షించడానికి, పొడిబారకుండా నిరోధించడానికి UV సన్ గ్లాసెస్ వాడాలి. డ్రై అయిస్ అనేది ఒక సాధారణ సమస్య, ముఖ్యంగా పిల్లలు ఎక్కువసేపు చదువుకోవడం లేదా ఎక్కువ గంటలు స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల అయిస్ డ్రైనెస్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు కళ్లలో గరుకుగా అనిపిస్తుంది. దురద పెట్టడం వల్ల రుద్దుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కళ్లు పొడిబారకుండా ఉండాలంటే తరచూ కళ్లను కడుక్కోవాలి.
ప్రతి కొద్ది నిమిషాలకు కళ్లను గట్టిగా మూసుకుని, ఆపై వాటిని తెరస్తే మంచిదని చెప్పారు. కళ్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. డ్రైనెస్ పోగొట్టేందుకు కంటి చుక్కల (Eye drops)ను ఉపయోగించాలి. డాక్టర్ సారంగ్ గోయెల్ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డీహైడ్రేషన్‌ను నివారించాలి. కళ్ల చుట్టూ మాయిశ్చరైజర్‌ను పూయాలి. ఎండలో టోపీని ధరించాలి. లేదా గొడుగును ఉపయోగించాలి. మీ కళ్లను రుద్దుకోకూడదు. వేసవిలో కండ్లకలక, కెరాటిటిస్, ఎండోఫ్తాల్మిటిస్, సెల్యులైటిస్, స్టై వంటి కంటి వ్యాధులు కూడా వచ్చే ముప్పు ఎక్కువ.
* కండ్లకలక ముప్పు
మానవ స్పర్శతో పాటు కండ్లకలక సోకిన వ్యక్తులు తాకిన ఉపరితలాల ద్వారా కూడా కండ్లకలక వ్యాపిస్తుంది. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి తరగతి గదుల్లో, పిల్లలలో సులభంగా వ్యాపిస్తుంది. ఇలాంటి సమస్యలను నివారించడానికి కంటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు తీసుకోవాలి.
* తీసుకోవాల్సిన ఆహారాలు
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం కీలకం. తీవ్రమైన కంటి సమస్యలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి బీటా కెరోటిన్, విటమిన్లు సి, ఇ, ఒమేగా 3, జింక్ వంటి యాంటీఆక్సిడెంట్లు గల ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. బీటా కెరోటిన్, విటమిన్ ఎ సమృద్ధిగా ఉండే క్యారెట్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. సిట్రస్ పండ్లు విటమిన్ సి అందిస్తాయి.
అయితే విటమిన్ ఇ ఉన్న గింజలు కంటిశుక్లం, వయో సంబంధిత మచ్చల క్షీణతను నివారిస్తాయి. సాల్మోన్ చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కంటి పొడిబారడాన్ని నివారిస్తాయి. రెటీనా ఆరోగ్యానికి తోడ్పడతాయి. గుడ్డు సొనలు విటమిన్ ఎ, జింక్, లుటీన్, జియాక్సంతిన్‌లను అందిస్తాయి. ఇవి వయో సంబంధిత క్షీణత, నైట్ విజన్ మెరుగుదలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
0 Comments:
Post a Comment