Curd : పెరుగుతో పాటు పొరపాటున కూడా వీటిని తినొద్దు, లేనిపోని సమస్యలు వస్తాయి?
పెరుగు ఆరోగ్య ప్రదాయిని. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ ప్రక్రియకు సహాయం చేస్తుంది. కడుపుని శాంతపరుస్తుంది. ఇతర ఆహారాల నుండి పోషకాలను గ్రహించడంలో శరీరానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలు పెరుగులో పుష్కలంగా ఉంటాయి.
పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిది అయినప్పటికీ.. పెరుగుతో పాటు కొన్ని ఆహార పదార్థాలను పొరపాటున కూడా తీసుకోవద్దు. వాటిని తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి పెరుగుతో పాటు తినకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు:
పాలను తోడు వేస్తే పెరుగుగా మారుతుంది. ఇందులోని ప్రో బయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు తగ్గడంలో కూడా పెరుగు సహాయపడుతుంది. పెరుగు యోని ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
చేపలు:
చేపలు తింటే పెరుగు అస్సలే తినొద్దు. ఎందుకంటే ఇవి రెండూ ప్రోటీన్లతో నిండి ఉంటాయి. జంతువుల ప్రోటీన్ ను వెజ్ ప్రోటీన్‌తో కలిపినప్పుడు వాటిని జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
నూనె ఆహారాలు:
పెరుగును పరాటా, పూరీ వంటి నూనె పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అలా తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల అలసటగా అనిపిస్తుంది. శరీరానికి శక్తి త్వరగా అందదు. అందువల్ల ఈ రెండిటిని కలిపి తీసుకోకూడదని చెబుతారు.
మామిడి:
మామిడి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. పెరుగు కూలెంట్. ఈ రెండింటిని కలిపితే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ ప్రక్రియలో అసమతుల్యత కలిగిస్తాయి. ఇది చర్మ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
ఉల్లిపాయ:
మామిడికాయలాగే, ఉల్లిపాయ కూడా వేడిగా ఉంటుంది. పెరుగును ఉల్లిపాయను కలిపి తింటే కొందరిలో దద్దుర్లు, తామర, సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అది చర్మ అలెర్జీలకు దారితీస్తుంది.
పాలు:
పాల నుండే పెరుగు తయారవుతుంది. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. పాల ఉత్పత్తుల్లో కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఈ సమస్యలు వస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మన్నం వెబ్ ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.
0 Comments:
Post a Comment