Construction Cost: ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుందంటే?
సొంతింటి కల అనేది ఎంతోమందికి ఉంటుంది. కొంతమంది కట్టేసిన ఇళ్ళు కొంటారు.
లేదా ఫ్లాట్లు కొంటారు. కొంతమంది స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటారు. ఈరోజుల్లో ఫ్లాట్ కొనాలంటే ఏరియాను బట్టి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలు అవుతుంది. కానీ స్థలం మాత్రం అపార్ట్మెంట్ లో ఉన్న అందరికీ చెందుతుంది. దీని వల్ల భవిష్యత్తులో నష్టమే. ఏదోలా కష్టపడి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే దీన్ని మించిన మంచి పని మరొకటి ఉండదు. ఇల్లు పాతబడిపోతుంది కానీ స్థలం పాతబడదు. పైగా దాని రేటు అనేది పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని భావిస్తారు. మీరు కనుక స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాద్ లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందామా?
హైదరాబాద్ నగరంలో 3 సెంట్ల స్థలంలో అంటే 144 గజాల ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే గనుక మూడు గ్రేడ్ లు ఉన్నాయి. బేసిక్, మీడియం, ప్రీమియం గ్రేడుల్లో ఇల్లు కట్టుకోవచ్చు. బేసిక్ గ్రేడ్ అయితే 15 లక్షల్లో ఇల్లు అయిపోతుంది. మీడియం గ్రేడ్ అయితే రూ. 19 లక్షల్లో అయిపోతుంది. ప్రీమియం గ్రేడ్ లో కట్టుకోవాలనుకుంటే రూ. 23 లక్షలు అవుతుంది. చదరపు అడుగుకు రూ. 1171, రూ. 1433, రూ. 1802 చొప్పున ఖర్చు అవుతుంది.
ఇంటి నిర్మాణ శాతం:
హోమ్ డిజైన్, అప్రూవల్: 2.5%
ఫుటింగ్ మరియు ఫౌండేషన్: 12%
రూఫ్ స్లాబ్: 13%
ఫ్లోరింగ్ అండ్ టైలింగ్: 10%
నీటి సరఫరా, ప్లంబింగ్ పని: 5%
ఎక్స్కవేషన్ (తవ్వకాలు): 3%
ఆర్సీసీ వర్క్, స్తంభాలు, కాలమ్స్, స్లాబ్స్: 10%
ఇటుకల పని, ప్లాస్టరింగ్: 17%
ఎలక్ట్రిక్ వైరింగ్: 8%
తలుపులు, కిటికీలు: 8%
బేసిక్ గ్రేడ్ లో కట్టుకోవాలనుకుంటే మెటీరియల్ ధరలు: రూ. 15,17,938-
సిమెంట్: రూ. 2,07,036/- (583 బ్యాగులు)
స్టీల్: రూ. 1,90,512/- (4536 కిలోలు)
ఇటుకలు: రూ. 1,47,744/- (24,624)
కాంక్రీట్: రూ. 66,484/- (2,462 క్యూబిక్ ఫీట్లకు)
ఇసుక: రూ. 98,496/- (2592 క్యూబిక్ ఫీట్లకు)
ఫ్లోరింగ్: రూ. 86,832/- (1296 చదరపు అడుగులకు)
తలుపులు: రూ. 66,951/- (233 చదరపు అడుగులకు)
కిటికీలు: రూ. 48,911/- (220 చదరపు అడుగులకు)
ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్: రూ. 10,692/- (194 చదరపు అడుగులకు)
శానిటరీ ఫైటింగ్స్: రూ. 90,720/- (1296 చదరపు అడుగులకు)
కిచెన్ వర్క్: రూ. 43,480/- (71 చదరపు అడుగులకు)
కాంట్రాక్టర్(ఆర్సీసీ, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్): రూ. 3,04,560/- (1296 చదరపు అడుగులకు)
పెయింటింగ్: రూ. 1,55,520/- (7,776 చదరపు అడుగులకు)
మీడియం గ్రేడ్ లో కట్టుకోవాలనుకుంటే మెటీరియల్ ధరలు: రూ. 18,26,503/-
సిమెంట్: రూ. 2,17,533/- (583 బ్యాగులు)
స్టీల్: రూ. 1,99,584/- (4536 కిలోలు)
ఇటుకలు: రూ. 1,72,368/- (24,624)
కాంక్రీట్: రూ. 73,872/- (2,462 క్యూబిక్ ఫీట్లకు)
ఇసుక: రూ. 1,16,640/- (2592 క్యూబిక్ ఫీట్లకు)
ఫ్లోరింగ్: రూ. 1,32,192/- (1296 చదరపు అడుగులకు)
తలుపులు: రూ. 1,17,573/- (233 చదరపు అడుగులకు)
కిటికీలు: రూ. 67,417/- (220 చదరపు అడుగులకు)
ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్: రూ. 13,608/- (194 చదరపు అడుగులకు)
శానిటరీ ఫైటింగ్స్: రూ. 1,21,824/- (1296 చదరపు అడుగులకు)
కిచెన్ వర్క్: రూ. 43,480/- (71 చదరపు అడుగులకు)
కాంట్రాక్టర్(ఆర్సీసీ, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్): రూ. 3,24,000/- (1296 చదరపు అడుగులకు)
పెయింటింగ్: రూ. 2,33,280/- (7,776 చదరపు అడుగులకు)
ప్రీమియం గ్రేడ్ లో కట్టుకోవాలనుకుంటే మెటీరియల్ ధరలు: రూ. 23,36,075/-
సిమెంట్: రూ. 2,40,861/- (583 బ్యాగులు)
స్టీల్: రూ. 2,26,800/- (4536 కిలోలు)
ఇటుకలు: రూ. 2,21,616/- (24,624)
కాంక్రీట్: రూ. 78,796/- (2,462 క్యూబిక్ ఫీట్లకు)
ఇసుక: రూ. 1,37,376/- (2592 క్యూబిక్ ఫీట్లకు)
ఫ్లోరింగ్: రూ. 1,72,368/- (1296 చదరపు అడుగులకు)
తలుపులు: రూ. 1,61,429/- (233 చదరపు అడుగులకు)
కిటికీలు: రూ. 93,856/- (220 చదరపు అడుగులకు)
ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్: రూ. 16,718/- (194 చదరపు అడుగులకు)
శానిటరీ ఫైటింగ్స్: రూ. 1,67,184/- (1296 చదరపు అడుగులకు)
కిచెన్ వర్క్: రూ. 1,12,751- (71 చదరపు అడుగులకు)
కాంట్రాక్టర్(ఆర్సీసీ, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్): రూ. 3,56,400/- (1296 చదరపు అడుగులకు)
పెయింటింగ్: రూ. 3,49,920/- (7,776 చదరపు అడుగులకు)
బేసిక్ అంటే తక్కువ క్వాలిటీ సిమెంట్, తక్కువ నాణ్యత ఉంటుంది. శానిటరీ, ఎలక్ట్రికల్, పెయింటింగ్ వంటి విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. కిచెన్ ప్లాట్ ఫారం, సింక్ మాత్రమే వస్తాయి. కనీస సదుపాయాలు ఉంటాయి. కానీ రిచ్ నెస్ అనేది ఉండదు. వెధవ రిచ్ నెస్ ఎందుకు మనకు, సింప్లిసిటీ చాలనుకుంటే రూ. 15 లక్షల్లో ఇల్లు అయిపోతుంది. మీడియం గ్రేడ్ లో సిమెంట్ క్వాలిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్, శానిటరీ, పెయింటింగ్, కాంట్రాక్టర్, ఆర్సీసీ, ఫ్లోరింగ్ వంటి వాటిలో నాణ్యత ఉంటుంది. కిచెన్ అయితే సెమీ మాడ్యులర్ లో వస్తుంది. దీనికి రూ. 18 లక్షల ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం గ్రేడ్ లో అంటే ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ వస్తుంది. పెయింటింగ్, ఎలక్ట్రికల్, శానిటరీ వర్క్ లో నాణ్యత ఉంటుంది. సిమెంట్, స్టీలు, ఇసుక, ఫ్లోరింగ్, కాంట్రాక్టర్ వర్క్ అన్నీ హై క్వాలిటీగా ఉంటాయి. దీని ఖర్చు రూ. 23 లక్షలు అవుతుంది. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రూ. 15 లక్షలు నుంచి రూ. 25 లక్షలు ఉండాలి. మిగతా ఏరియాల్లో కూడా ఇలానే ఉండచ్చు. ఇక ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వ్యత్యాసం ఉండవచ్చు.
గమనిక: ఈ లెక్కలు కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించగలరు.
0 Comments:
Post a Comment