బలవర్థకమైన బ్రేక్‌ఫాస్ట్ : చిల్లా
రోజు మొత్తంలో బ్రేక్ ఫాస్ట్ అత్యంత కీలకమైన ఆహారం. దీన్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకు అనువైన బ్రేక్‌ఫాస్ట్ ఐదు రకాల పప్పులతో కూడిన 'చిల్లా'!
దాన్నెలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం!
కావలసిన పప్పులు:
కంది పప్పు: ఒక కప్పు
పసుపు పచ్చని పెసలు: ఒక కప్పు
పెసర గుళ్లు: ఒక కప్పు
పచ్చి సెనగలు: ఒక కప్పు
మినుములు: ఒక కప్పు
తయారీ ఇలా:
అన్నిటినీ కాలిపి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.
అర టీస్పూను వాము, ఒక ఉల్లిపాయ తరుగు, ఒక టమాటా తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు జోడించి మిక్సీలో రుబ్బుకోవాలి.
పెనం మీద దోశల్లా పోసుకుని, రెండు వైపుల్లా కాల్చి, టమాటా చట్నీతో తినాలి.
0 Comments:
Post a Comment