Career Tips: సమ్మర్ లో సింపుల్ కోర్సు .. రూ.10 లక్షలకు పైగా ప్యాకేతో 10 రకాల జాబ్స్.. ఓ లుక్కేయండి
గత కొన్నేళ్లుగా జాబ్ మార్కెట్‌లో (Job Market) చాలా మార్పులు వచ్చాయి.
ఇప్పుడు ఉద్యోగాలు డిగ్రీ మరియు అనుభవం ఆధారంగా మాత్రమే అందుబాటులో లేవు. ఈ రోజుల్లో ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థి వివిధ అంశాల్లో కలిగిన నైపుణ్యాన్ని ఎక్కువగా పరీక్షిస్తున్నారు. ఇందు కోసం.. చాలా స్వల్పకాలిక కోర్సులు, నైపుణ్యం ఆధారిత ఉద్యోగాలు (Short Term Courses) కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతీ వ్యాపారం, ఆఫీస్ లోనూ అంతా కంప్యూటరీకరణ జరిగింది. ప్రతీ విషయాన్ని, ముఖ్యమైన డేటాను డిజిటల్ (Digital Date) రూపంలోనే భద్రపరుస్తున్నారు. తద్వారా ఆ డేటాను అనాలసిస్ చేయడం చాలా సులువు. ఇంకా భద్రపరచడం, ట్రాన్స్ ఫర్ చేయడం కూడా ఈజీ. అనేక కంపెనీల్లో డేటాను సేవ్ చేయడానికి MS Excelను వాడుతున్నారు.
ఈ సాఫ్ట్ వేర్ లో పెద్ద సైజ్ డేటాను చిన్న చిన్న ఫైల్ లో స్టోర్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ సాఫ్ట్ వేర్ కూడా. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు కూడా ఈ సాఫ్ట్ వేర్ ను చాలా సులువుగా, ఈజీ చిట్కాలతో నేర్చుకోవచ్చు. మార్కెట్లో MS Excel తో కూడిన అనేక కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. MS Excel కోర్సు చదవడం ద్వారా, మీరు ఈ క్రింది రంగాల్లో కెరీర్ స్టార్ట్ చేయవచ్చు. వీటిలో లక్షల ప్యాకేజీ (హై ప్యాకేజీ జాబ్స్) కూడా ఉన్నాయి. మీరు ఓ లుక్కేయండి..
S.No ఉద్యోగం ప్యాకేజీ
1. డేటా అనలిస్ట్ రూ.5 లక్షలు
2. ఫైనాన్షియల్ అనలిస్ట్ రూ.6.5 లక్షలు
3. ఆపరేషన్స్ అనలిస్ట్ రూ.5 లక్షలు
4. బిజినెస్ అనలిస్ట్ రూ.7 లక్షలు
5. MIS అనలిస్ట్ రూ.4 లక్షలు
6. ప్రాజెక్ట్ మేనేజర్ రూ.12 లక్షలు
7. ఆపరేషన్ మేనేజర్ రూ.8 లక్షలు
8. బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ రూ.8 లక్షలు
9. అకౌంట్ మేనేజర్ రూ.8 లక్షలు
10. 10- సేల్స్ మేనేజర్ రూ.6 లక్షలు
మీరు మీ సమయం, బడ్జెట్ మరియు అవసరాన్ని బట్టి షార్ట్ టర్మ్ కోర్సులు/లాంగ్ టర్మ్ ఎక్సెల్ కోర్సులు చేయవచ్చు. మీకు ఓపిక ఉంటే యూట్యూబ్ ద్వారా కూడా మీరు ఫ్రీగా ఎక్సెల్ కోర్సులు చేయవచ్చు. మీరు డిగ్రీ, ఇంటర్ ఏది చదువుతున్నా కూడా లేదా చదువు పూర్తయినా.. ఈ సమ్మర్ లో సమయం వృథా చేయకుండా ఈ కోర్సు నేర్చుకోండి.
0 Comments:
Post a Comment