Career Options: ఇంటర్ తర్వాత రూ.లక్షల్లో జీతాలు వచ్చే కెరీర్ ఆప్షన్స్..వివరాలివే..!
ఈ ఏడాది ఎడ్యుకేషనల్ ఇయర్ ముగిసింది.
సీబీఎస్‌ఈతో పాటు వివిధ రాష్ట్రాల బోర్డ్‌లు ఇటీవల ఇంటర్ ఫలితాలను వెల్లడించాయి. ఇప్పుడు విద్యార్థులు తమ కెరీర్ గురించి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఈ విషయంలో గందరగోళానికి లోనవుతుంటారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హయ్యర్ స్టడీస్ చదవడం, రెండో ఆప్షన్‌గా ఇంటర్ అర్హతతో ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించడం. సాధారణంగా విద్యార్థులు హయ్యర్ స్టడీస్‌కే మొగ్గు చూపుతారు. అయితే ఇంటర్ తర్వాత కొన్ని కోర్సులు బెస్ట్ కెరీర్ ఆప్షన్స్‌గా ఉన్నాయి. ఎక్కువ జీతం అందించేవి ఏవో పరిశీలిద్దాం.(ప్రతీకాత్మక చిత్రం)
చార్టర్డ్ అకౌంటెంట్ (CA) : ఇంటర్ తరువాత సీఏ చేస్తే భవిష్యత్ కెరీర్ ఉజ్వలంగా ఉంటుంది. కంపెనీలకు సంబంధించిన అకౌంట్స్ వ్యవహారాలను చార్టర్డ్ అకౌంటెంట్స్ చక్కబెడుతుంటారు. కంపెనీలు జరిపిన ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేసే ప్రక్రియలో సీఏ కీలకపాత్ర పోషిస్తారు. వీరి సగటు ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ.7లక్షల నుంచి రూ.8 లక్షలు ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి కంపెనీలు రూ.20లక్షలకు పైగా వేతనాలు అందిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి CA పూర్తిచేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ : ఇంటర్ తరువాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా కెరీర్ కొనసాగించాలంటే ఫైనాన్స్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేయాలి. కంపెనీలు, ప్రభుత్వాలు సాధారణంగా సెక్యూరిటీ పూచీకత్తు, అమ్మకం ద్వారా మూలధనాన్ని సమీకరిస్తాయి. ఈ వ్యవహారంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ కీలకంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం వీరికి సగటు ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ.8లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంది. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కు రూ.50 లక్షలకు పైగా వేతనాలు అందిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
డేటా సైంటిస్ట్ : డేటా సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే డేటా సైన్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ చేయాలి. ఇటీవల కాలంలో డేటా సైంటిస్ట్‌లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలకు డేటా ఇప్పుడు కీలకంగా మారింది. డేటా ఆధారంగానే కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటాయి. దీంతో డేటాను అర్థం చేసుకోవడం, అనలైజ్ చేయడంలో డేటా సైంటిస్ట్‌లది కీలక పాత్ర. వీరికి ప్రస్తుతం సగటు ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ.4 నుంచి 5 లక్షలుగా ఉంది. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి సంవత్సర ప్యాకేజీగా రూ.20 లక్షలు కూడా ఇస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ : ఇంటర్ తరువాత బీటెక్‌లో ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా ఉంటున్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ కోర్సుల కంటే కంప్యూటర్ సైన్స్ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకు సగటు ప్రారంభ వేతనం సంవత్సరానికి రూ. 3-4 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ఏడాదికి రూ.20లక్షలకు పైగా ప్యాకేజీ అందుకుంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ : ఇంటర్ తరువాత బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. కంపెనీల పనితీరు, లాభాలు మెరుగుపర్చడంలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ కీలక పాత్ర పోషిస్తారు. వీరు ఇచ్చే సలహాలు, సూచనలతో కంపెనీ యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకుంటాయి. దీంతో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌లకు డిమాండ్ బాగా ఉంది. సగటు ప్రారంభ వేతనం రూ. సంవత్సరానికి 5-6 లక్షలు ఉంటుంది. ఇక ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కు రూ. 25 లక్షలు పైగా కంపెనీలు చెల్లిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
0 Comments:
Post a Comment