Breaking News: అవినాష్ రెడ్డిని వదలని సీబీఐ..మరోసారి నోటీసులు..అరెస్ట్ ఖాయమా?
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ వదలడం లేదు.
ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారించిన సీబీఐ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఇవాళే కడపకు వెళ్లిన అవినాష్ సీబీఐ నోటీసులతో హైదరాబాద్ బయలుదేరారు. దీనితో రేపటి విచారణకు అవినాష్ హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి.
అయితే ఈసారి కేవలం విచారణతోనే ముగిస్తారా? లేక అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా? అసలేం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణలో సీబీఐ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది. కేవలం స్టేట్ మెంట్ రికార్డ్ చేసి మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తారా? లేక అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
0 Comments:
Post a Comment