వే సవి వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో ఫర్‌ఫ్యూమ్స్, సెంట్ బాటిళ్లు, టాల్కమ్ ఫౌడర్స్ విక్రయాలు జోరుగా సాగుతాయి. కారణం.. ఎండాకాలంలో మనిషి శరీరం నుంచి వచ్చే దుర్వాసన.
ప్రపంచంలో కోట్లాది మంది నివసిస్తున్నారు. ప్రతి మనిషి శరీర వాసన భిన్నంగా ఉంటుంది. కొందరికి తక్కువ శరీర దుర్వాసన ఉంటుంది. మరికొందరికి వేసవిలో వారి దగ్గర నిలబడటం కూడా కష్టంగా ఉంటుంది.
మరి శరీరం ఇలా వాసన ఎందుకు వస్తుంది? ఈ వాసనకు చెమట మాత్రమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? శరీర దుర్వాసన వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవిలో శరీరం వాసన ఎందుకు వస్తుంది?
శరీర దుర్వాసన ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ వస్తుంటుంది. అయితే, ఈ వాసన చలి కాలంలో ఎక్కువ దుస్తులు ధరించడం వల్ల దుర్వాసన బయటకు రాదు. నిజానికి, ప్రతి మనిషి శరీరం నుంచి వచ్చే వాసన వెనుక కొన్ని ప్రత్యేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ప్రతి మనిషి శరీరంపై వివిధ రకాల బ్యాక్టీరియా ఉంటుంది.
అవి మనిషి చెమటతో కలిసినప్పుడు.. వాటి వాసన చాలా ఎక్కువగా వస్తుంది. దాంతో మీ పక్కన నిల్చున్న వారికి కూడా ఆ దుర్వాసన వస్తుంటుంది.
ప్రతి ఒక్కరిలో శరీర వాసన భిన్నంగా ఉటుంది..
ఈ భూమిపై కోట్లాది మంది మనుషులు ఉన్నట్లుగానే.. కోట్లాది బ్యాక్టీరియాలు కూడా జీవిస్తున్నాయి. వివిధ రకాల బాక్టీరియా శరీరం నుండి వెలువడే వివిధ వాసనలకు కారణం.
ఒకరి శరీరం నుండి చాలా దుర్వాసన వస్తుంటే, దానికి కారణం FMO3 జన్యువులోని లోపం కావొచ్చు. మరోవైపు, కొంతమంది వ్యక్తుల శరీరం నుండి వచ్చే దుర్వాసనకు ఫిష్ స్మెల్ సిండ్రోమ్ కారణమై ఉంటుంది.
సైన్స్ భాషలో, దీనిని ట్రిమెథైలామినూరియా (TMA) అంటారు. ఈ పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నట్లయితే.. వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే.. ఇది కాలక్రమేణా శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది.
0 Comments:
Post a Comment