లుకేమియా దీన్నే బ్లడ్ క్యాన్సర్ అని పిలుస్తారు. ఎముక మజ్జ, శోషరస వ్యవస్థతో సహా శరీరంలోని రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్. దీనికి వివిధ రూపాలు ఉన్నాయి.
ఇందులో అత్యంత సాధారణ రకం తీవ్రమైన లింఫోసైటిక్ లుకేమియా. బ్లడ్ క్యాన్సర్ కేసులు నెమ్మదిగా పెరిగిపోతూ ఉన్నాయి. లుకేమియా సాధారణంగా తెల్ల రక్త కణాళ్ళు పని చేయకపోవడాన్ని కలిగి ఉంటుంది.
బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణమేంటి?
తెల్ల రక్తకణాలు శక్తివంతమైన ఇన్ఫెక్షన్ ఫైటర్స్. అవి సాధారణంగా పెరుగుతాయి. శరీరానికి అవసరమైన విధంగా మారతాయి. కానీ లుకేమియా ఉన్న రోగులలో ఎముక మజ్జలవ అధిక మొత్తంలో తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
అవి సరిగ్గా పని చెయ్యవు. తక్కువ వ్యవధిలో అభివృద్ధి చెందే తీవ్రమైన లుకేమియా పిల్లల్లో కనిపించే అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ క్యాన్సర్ లక్షణాలు మారుతూ ఉంటాయి.
లుకేమియా లక్షణాలు
⦿ తరచుగా తీవ్రమైన ఇన్ఫెక్షన్, యాంటీ బయాటిక్స్ తీసుకున్నప్పటికీ ఆరోగ్యం బాగోలేకపోవడం జరుగుతుంది. తరచుగా జ్వరంగా అనిపించడం బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు.
⦿ లుకేమియా మరొక సంకేతం ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే మైకం, బలహీనత, అలసటగా అనిపిస్తుంది.
⦿ శోషరస గ్రంథులు ఉబ్బినట్లయితే అది కూడా ఒక లక్షణంగా పరిగణించాలి.
⦿ ప్లీహం లేదా కాలేయం పెరగడం కూడా లుకేమియాకి ప్రమాద కారకంగా మారుతుంది.
⦿ ఆకస్మిక గాయాలు లేదా చర్మంలో చిన్న ఎర్రటి మచ్చలు కనిపించడం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు రక్త క్యాన్సర్ ప్రారంభానికి సంకేతాలు.
⦿ అకస్మాత్తుగా అధిక బరువు కోల్పోవడం అనారోగ్యానికి సంకేతం. బరువులో మార్పు వస్తే వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పీడియాట్రిక్ అంకాలజిస్ట్ ద్వారా బ్లడ్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. దీన్ని చాలా వరకు నయం చేయగలదు. చికిత్సకు 95 శాతానికి పైగా చికిత్సకు స్పందిస్తారు.
బ్లడ్ క్యాన్సర్ వస్తే చాలా మంది ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు. అందుకు కారణం దీనికి చికిత్స కాస్త ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఏటా దాదాపు 40 వేల నుంచి 50 వేల మంది బ్లడ్ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ప్రస్తుతం దీనికి చికిత్స విదేశాల్లో లభిస్తుంది. లుకేమియా రెండు రకాలు. అక్యూట్ లుకేమియా, క్రానిక్ లుకేమియా. అక్యూట్ ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. కీమోథెరపీ ద్వారా కొన్ని నెలల పాటు చికిత్స అందిస్తారు.
క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది. పొగాకు, ధూమపానం వంటి అలవాట్లు వల్ల అక్యూట్ లుకేమియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎముక మజ్జ బయాప్సీ చేయడం, రక్త పరీక్ష ద్వారా లుకేమియా వ్యాధిని గుర్తించవచ్చు. క్యాన్సర్ దశను బట్టి వైద్య నిపుణులు చికిత్స చేస్తారు.
0 Comments:
Post a Comment