స్కూల్ టీచర్ మీద వేటు వేసిన సిద్దూ ప్రభుత్వం, మ్యాటర్ తెలిస్తే షాక్ !
కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి పంపించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు అని తెలిసింది.
అయితే సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తూ వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్ చేసిన ప్రభుత్వ టీచర్ మీద వేటు వేసి ఆయన్ను ఏకంగా ఇంటికి పంపించేశారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హోసదుర్గ తాలుకాలోని కానుబేనహళ్లి ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న శాంతమూర్తిని సస్పెండ్ చేస్తూ చిత్రదుర్గ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏకారణంగా టీచర్ శాంతమూర్తిని సస్పెండ్ చేశాము అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు వివరించారు.
శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. దేశంలోని వివిద పార్టీలకు చెందిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులతో పాటు సుమారు లక్ష మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనారు.
సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసిన రోజు టీచర్ శాంతమూర్తి ఆయన వాట్సాప్ గ్రూప్ లో సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన నాయకులు, వారు చేసిన అప్పుల వివరాలు ఆ వాట్సాప్ గ్రూప్స్ లో శాంతమూర్తి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఎస్ఎం క్రిష్ణ సీఎంగా ఉన్న అవదిలో రూ. 3, 690 కోట్లు అప్పులు, ధర్మసింగ్ సీఎంగా ఉన్న కాలంలో రూ, 15, 635 కోట్ల అప్పులు, హెచ్ డీ కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో రూ, 3, 545 కోట్ల అప్పులు, బీఎస్ యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో రూ. 25, 653 కోట్ల అప్పులు, సదానంద గౌడ సీఎంగా ఉన్న సమయంలో రూ. 9, 464 కోట్ల అప్పులు, జగదీష్ శెట్టర్ సీఎంగా ఉన్న సమయంలో రూ. 13, 464 కోట్ల అప్పులు చేశారని శాంతమూర్తి వాట్సాప్ గ్రూప్ లో వివరాలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
తరువాత సీఎం అయిన సిద్దరామయ్య సీఎం అయిన తరువాత రూ. 2, 42, 000 కోట్లు అప్పులు చేశారని, ఎస్ఎం క్రిష్ణ కాలం నుంచి జగదీష్ శెట్టర్ సీఎంగా ఉన్న కాలంలో చేసిన అప్పులు రూ. 71, 331 కోట్లు అయితే సిద్దరామయ్య గతంలో సీఎంగా ఉన్న కాలంలో చేసిన అప్పులు రూ. 2, 42, 000 కోట్లు అని టీచర్ శాంతమూర్తి వాట్సాప్ లో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ టీచర్ అయిన ఆయన ప్రభుత్వుం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందుకే ఆయన్ను సస్పెండ్ చేశామని విద్యా శాఖ అధికారులు అంటున్నారు అయితే సిద్దరామయ్య ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ఓ టీచర్ స్వతంత్రంగా ఆయన సేకరించిన సమాచారం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే తప్పు ఏముందని బీజేపీ మండిపడుతోంది. సిద్దరామయ్య ప్రభుత్వం అప్పుడే ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీజేపీ విమర్శించింది.
0 Comments:
Post a Comment