కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే! రేపే ప్రమాణస్వీకారం! మరి డీకే పరిస్థితి?
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యకే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఉపముఖ్యమంత్రి, కీలక మంత్రిత్వ శాఖలు లభించనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక సీఎం పీఠంపై చిక్కుముడి వీడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పార్టీ చెరో రెండున్నర ఏళ్లు సీఎం పీఠాన్ని పంచుకొనున్నారని సమాచారం. మొదటి రెండున్నర ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి, నీటి పారుదల, విద్యుత్ శాఖ మంత్రి పోస్టు ఖరారైందని సమాచారం. గురువారమే సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
0 Comments:
Post a Comment