Belly Fat: వేలాడే పొట్టతో బాధపడుతున్నారా? ఈ కషాయాన్ని 30 రోజుల తాగితే చాలు, సులభంగా చెక్ పెట్టొచ్చు!
How To Get Rid Of Belly Fat: ప్రస్తుతం చాలామంది వేలాడే పొట్ట కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా అంద హీనంగా తయారవుతున్నారు.
ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలి అనుసరించే చాలా మందిలో ఇలాంటి సమస్యలు రావడం సర్వసాధారణమే.. చాలామంది లో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరగడం కారణంగా గుండెపోటు మధుమేహం అధిక రక్తపోటు సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిని అనుసరించడం మానుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేలాడే పొట్ట కారణంగా ప్రస్తుతం చాలామంది ఇబ్బందులు పడుతూ రోజు పనులు చేస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ కారణంగా అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన మెంతులతో తయారుచేసిన కషాయాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
ఈ కషాయంలో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించి శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా సులభంగా నియంత్రిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ మెంతులతో తయారుచేసిన కషాయాన్ని ప్రతిరోజు తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఈ కషాయాన్ని ప్రతిరోజు తాగడం చాలా మంచిది. ఈ మెంతులతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కషాయాన్ని తయారు చేయడానికి ముందుగా రెండు చెంచాల మెంతులను తీసుకొని.. ఒక గ్లాసు నీటిలో ఈ మెంతులను వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే.. కషాయంలా మరిగించాల్సి ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత వడబోసుకొని కషాయాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని తాగొచ్చు. ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయి.
0 Comments:
Post a Comment