astrology: శని దోష నివారణకు నేరేడుపండ్లు.. అద్భుతమైన ఫలితాలు!!
శని దోష నివారణకు నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మన కడుపులో పేరుకుపోయిన మలినాలకు, మనం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి శని కారకుడు. ఇక నేరేడు పండ్లు తింటే కడుపులో ఉండే మలినాలు శుభ్రం కావడమే కాకుండా, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుండి కాస్త బయటపడవచ్చు.
నేరేడు పండ్లు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. మూత్ర సంబంధమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. నేరేడు పండు శని దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు నయమవుతాయి. అంతేకాదు పూజ చేసిన తరువాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే వివిధ రకాల రోగాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
నేరేడు పండును శని దేవుడికి ప్రియమైన నల్లనువ్వులతో కలిపి దానం చేస్తే జీవితంలో శని బాధలు తొలగిపోతాయి . దేవుడి పేరుతో పూజించిన నేరేడు పండ్లను బిచ్చగాళ్ళకు దానం చేస్తే కూడా దరిద్రం దరిచేరదని చెబుతారు. అంతేకాదు నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం వస్తుందని చెబుతున్నారు.
ప్రతిరోజు మనం నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే రోగాల నుండి బయట పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు భోజనంతోపాటు నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే మీకు ఎప్పటికీ భోజనం లభిస్తుందని చెబుతారు. ఇక శని దేవుడి దుష్ప్రభావాలు జీవితం పైన ఉండకుండా ఉండాలంటే నువ్వుల నూనెతో కాని ఆముదం తో కానీ శని దేవుడ్ని పూజించాలి.
పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి నేరేడు పండు శని దోష నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని శని దేవునికి సమర్పించినా, ఎవరికైనా దానం చేసినా సత్ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది.
0 Comments:
Post a Comment