APPSC Notifications ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 20 నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్దం..!!
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతోంది. మూడు నెలల సమయంలో 20 ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్దం అవుతోంది. 111 గ్రూపు వన్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి ఉన్న గ్రూపు వన్ పోస్టులకు సంబంధించి పూర్తి ప్రక్రియను అగస్టు చివరి కల్లా పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
గ్రూప్ 4కు సంబంధించిన ఫలితాలను మే 3వ వారంలోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. మూడు నెలల సమయంలోగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
కొత్త నోటిఫికేషన్లు జారీ దిశగా:కొత్తగా జారీ చేసే నోటిఫికేషన్ల గురించి కసరత్తు జరుగుతోంది. గ్రూప్ వనకు సంబంధించి 140 పోస్టుల భర్తీ చేయనున్నారు. గ్రూపు 2కు సంబంధించి దాదాపు వెయ్యి పోస్టులకు పైగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. వీటితో పాటుగా డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులు నాలుగు వందల వరకు నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దం అవుతోంది. ఇంటర్మీడియట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించి పోస్టుల విషయంలో ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పోస్టుల విషయంలో స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసే విధంగా ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లకు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.
సిలబస్ లోనూ మార్పులు:ఇప్పటికే జారీ చేసిన 124 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కావటంతో, వీటికి సంబంధించిన పరీక్షల తేదీలను వచ్చే ప్రకటించనున్నారు. గ్రూపు 2 సిలబస్ లోనూ మార్పులు చేస్తున్నారు. 35 శాతం వరకు సిలబస్ రిపీట్ కావటంతో కొత్త సిలబస్ ను రూపొందిస్తున్నారు. పాత సిలబస్‌లో హిస్టరీకి, పాలిటికి చెరి 75 మార్కులు ఉంటే ఒక్క ఎకనామిక్స్‌కే 150 మార్కులు ఉండేవి. దీంతో, ఎకనామిక్స్‌ను ప్రధాన సబ్జెక్ట్‌గా చదివిన వారితో పోల్చుకుంటే మిగిలిన వారికి పరీక్షలో న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉంది. తాజాగా ఎకనామిక్స్‌ను 75మార్కులకు పరిమితం చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్కులు కేటాయించారు. ఇదే సమయంలో ఇండియన్ సోసైటీ అనే కొత్త సిలబస్‌ను తీసుకొచ్చారు. ఇందులో సంక్షేమ పథకాల గురించి వివరించినట్లు సమాచారం.
న్యాయ చిక్కులు లేకుండా:కొత్త నోటిఫికేషన్ల జారీలో ఎలాంటి న్యాయ పరమైన సమస్యలకు అవకాశం లేకుండా ఏపీపీఎస్సీ జాగ్రత్తలు తీసుకుంటోంది. పేపర్ తయారీలో ఎక్కడా ఎటువంటి పొరపాట్లు, తప్పులు లేకుండా పకడ్బందీగా సిద్దం చేసేలా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. గ్రూపు ఒన్ ఫలితాలు 20 రోజుల్లోనే ఏపీపీఎస్సీ వెల్లడించిన అంశాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న సిలబస్ మేరకు ఏ అభ్యర్ధి అయినా కోచింగ్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పరీక్షలకు సిద్దమై రాసే విధంగా మార్పులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దీంతో, రానున్న మూడు నెలల కాలంలో ఏకంగా 20 నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్దం అవుతుండటంతో నిరుద్యోగులకు అవకాశంగా మారనుంది.
0 Comments:
Post a Comment